Moviesలేడీస్ కిస్సింగ్ సీన్స్ పై మోహన్ బాబు కామెంట్స్ వైరల్..!!

లేడీస్ కిస్సింగ్ సీన్స్ పై మోహన్ బాబు కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెర పై కనిపించి చాలా ఏళ్ళు అవుతుంది. పాలిటిక్స్ లో కి ఎంటర్ అయ్యాక ఆయన సినిమాల పై కాన్సెన్ట్రేషన్ చేయడం లేదు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఏవో అడపాదడపా చిన్న పాత్రల్లో కనిపించారే కానీ ఫుల్ లెంత్ రోల్ లో మోహన్ బాబు కనిపించి చాలా ఏళ్లు అవుతుంది. ఇక ఇప్పుడు మళ్ళీ “సన్ ఆఫ్ ఇండియా” మూవీతో మనముందుకు రాబోతున్నాడు మోహన్ బాబు.

మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ” Son Of India”. ఈ సినిమాను డైమండ్ రత్నబాబు తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేసారు అని ఇప్పటికే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. లీక్ అయిన సమాచారం బట్టి..ఈ Son of India మూవీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన్నట్లు తెలుస్తుంది . ఈ సినిమా ఫిబ్రవరి 18న ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమైయారు. సినిమా ప్రొమోషన్లపై దృష్టి పెట్టిన మేకర్స్.. రీసెంట్ గానే గ్రాండ్ గా “సన్ ఆఫ్ ఇండియా” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా జరిపారు.

అయితే సినిమా ప్రమోషన్లో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఈ సినిమా పై పలువు ఆసక్తికర కామెంట్స్ చేసారు. “‘స‌న్ ఆఫ్ ఇండియా’ సినిమా స‌మ‌యంలో విష్ణు మాట్లాడుతూ కాస్త రిస్కే అన్నాడు. అయినా ప‌ర్లేద‌ని ముంద‌డుగు వేశాం. ఇందులో ఫ్యామిలీ అంశాలే కాదు. రాజ‌కీయ అంశాల‌ను ట‌చ్ చేశాం. ఓ ఎమ్మెల్యే కారణంగా చేయని తప్పుకు జైలుకు వెళ్ళిన ఓ వ్యక్తి గురించే మొత్తం ఈ కధ నడుస్తుంది.

ఇక ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయి. యువతకు నచ్చే కొన్ని సీన్స్ తో పాటి..ఇద్దరు ఆడవాళ్లు ముద్దుపెట్టుకోవడం వంటి సన్నివేశాలు కూడా ఈ సినిమాలో చిత్రీకరించాం. ఇక ఆ సీన్స్ ని విష్ణు ఎడిట్ చేయమన్నాడు. కానీ నేను ఒప్పుకోలేదు. నిజానికి ‘సన్నాఫ్ ఇండియా’ను ఓటీటీ కోసం తీసాం..అందుకే కొంచేం బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ కంటెంట్ బాగుండటంతో థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం..అందుకే అలాంటి సీన్స్ టైం తగ్గించాం” అంటూ చెప్పుకొచ్చారు మోహన్ బాబు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news