Moviesఘ‌రానా మోస‌గాడు సుఖేష్ లిస్టులో జాక్వెలినే కాదు.. ఆ టాప్ హీరోయిన్లు...

ఘ‌రానా మోస‌గాడు సుఖేష్ లిస్టులో జాక్వెలినే కాదు.. ఆ టాప్ హీరోయిన్లు కూడా… ఎన్నో లీల‌లు..!

32 ఏళ్ల వ‌య‌స్సులోనే రు. 200 కోట్ల పై చిలుకు మోసాల‌కు పాల్ప‌డి జైల్లో శిక్ష అనుభ‌విస్తోన్న సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్‌కు సంబంధించి త‌వ్వేకొద్ది చాలా వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈడీ విచార‌ణ‌లో క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ రు. 200 కోట్ల‌లో సుఖేష్ ఎక్కువుగా జ‌ల్సాల కోస‌మే ఖ‌ర్చు పెట్టిన‌ట్టు చెపుతున్నారు. ఇక హీరోయిన్ల కోస‌మే ఎడాపెడా ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఖ‌ర్చు చేసేశాడ‌ట‌. వారిని ఎలాగైనా బుట్ట‌లో వేసుకునేందుకు, వారిని ఆక‌ర్షించేందుకు సుఖేష్ ఎంతైనా ఖ‌ర్చు చేసేవాడ‌ని ఈడీ నివేదిక‌లో వెల్ల‌డైంది.

ఇక ఇప్ప‌టికే సుఖేష్ స‌న్నిహితురాలిగా బాలీవుడ్ అందాల భామ‌ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరు ప‌లుసార్లు వినిపించింది. ఆమె సంతోషం కోసం, ఆమె కుటుంబ స‌భ్యుల‌ను మెప్పించేందుకు సుఖేష్ భారీ మొత్తంలో ఖ‌ర్చు చేసిన‌ట్టు కూడా ఈడీ పేర్కొంది. అయితే సుఖేష్ లిస్టులో ఇప్ప‌టి వ‌ర‌కే కేవ‌లం జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మాత్ర‌మే ఉంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే సుఖేష్ మ‌రికొంత మంది హీరోయిన్ల‌కు కూడా వ‌ల వేసిన‌ట్టు తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని ఈడీ కూడా నిర్దారించింది.

బాలీవుడ్ న‌టి నోరా ఫ‌తేహి కోసం కూడా సుఖేష్ భారీగా డ‌బ్బులు వెద‌జ‌ల్లాడ‌ని.. అంతే కాకుండా సుఖేష్ లిస్టులో మ‌రికొంద‌రు హీరోయిన్లు కూడా ఉన్నార‌ని తెలుస్తోంది. పాపుల‌ర్ న‌టీమ‌ణుల‌కు భారీగా ఖ‌ర్చు పెట్టి వారి సాన్నిహిత్యం కోసం ఎంతో ప‌రిత‌పించి పోయేవాడ‌ని.. అంతేకాకుండా వారి కోసం ఈ సుఖ పురుషుడు ఎంత‌కు అయినా తెగించేవాడ‌ని కూడా తెలుస్తోంది.

సుఖేష్ లిస్టులో జాన్వీ క‌పూర్ – సారా అలీఖాన్ – భూమీ పెడ్నేక‌ర్ లు కూడా టార్గెట్‌గా ఉన్నార‌ట‌. వీరికి ద‌గ్గ‌ర‌య్యేందుకు కూడా భారీగా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టే ప్లాన్ వేసిన‌ట్టుగా కూడా ఈడీ విచార‌ణ‌లో తేలింది. మోసాల ద్వారా సంపాదించిన సొమ్ముతో హీరోయిన్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని.. వారిని బుట్ట‌లో వేసుకునేందుకు జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డి విప‌రీతంగా ఖ‌ర్చు చేస్తూ వ‌చ్చాడు. చివ‌ర‌కు బండారం బ‌య‌ట ప‌డి పోలీసుల‌కు చిక్కాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news