Moviesసిగ్గుందా..అలా చేసి పరువు పొగొట్టుకున్న పెద్దింటి కోడలు..!!

సిగ్గుందా..అలా చేసి పరువు పొగొట్టుకున్న పెద్దింటి కోడలు..!!

లెజెండ్రీ సింగ‌ర్‌, గాన కోకిల లతా మంగేష్కర్ బ్రతికున్నప్పుడు పెద్దగా వివాదాల జోలికి వెళ్లలేదు కానీ ఆమె చనిపోయాక చాలా మంది ఆమె కారణంగా నెట్టింట ట్రోల్ అవుతున్నారు. భార‌త గానికోకిల గా పేరు సంపాదించుకున్న ల‌తా మంగేష్క‌ర్ త‌న 92 ఏళ్ల వ‌య‌స్సులో మృతిచెందింది. ఆరోగ్య విషయంలో చలా కేర్ తీసుకునే లతాజీ గత కొన్ని నెలలుగు పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలోనే ఆమెకు కరోనా సోకగ్గా..చికిత్స తీసుకున్న తరువాత కోలుకుని బాగానే ఉన్నింది. కానీ సడెన్ గా మళ్ళీ ఏమైందో తెలియదు కానీ.. ఆమెకు ఆరోగ్యం బాగోలేక ముంబైలోని ఓ ప్ర‌ముఖ కార్పొరేట్ ఆసుప‌త్రిలో చేర్పించారు.

గత నెలరోజుల నుంచి తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆదివారం ఉదయం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో కన్నుమూసింది అంటూ డాక్టర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే లతాజీ మృతి పట్ల ఆమె అభిమానులతో పాటు బడా బడా సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్.. యావత్ సినీ ప్రేమికులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు అందరూ స్పందిస్తూ ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ..ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. ఇక ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఆమె పార్థివదేహాన్ని సందర్శించి.. నివాళులు అర్పించారు.

హిందీలో వేల పాటు పాడిన లతాకి బాలీవుడ్‌ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. అదేవిధంగా బాలీవుడ్ బడా స్టార్స్ అయిన రణబీర్ కపూర్, షారుక్ ఖాన్,అమితా బచ్చన్ వంటి సినీ స్టార్స్ కూడా లతాజీ పార్థివదేహానికి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులు అర్పించారు. హిందీ ప్రముఖులే కాదు, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, నార్త్ ఇలా అన్ని భాషలకు చెందిన సినీ ప్రముఖులు ఆమెకి సంతాపం తెలిపారు. ఆమెతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

అయితే, దొంగలు పడిన ఆరు నెలలు=కు కుక్కలు మొరిగిన్నట్లు..లతాజీ చనిపోయిన రెండురోజులకు ఐశ్వర్య రాయ్ లతాజి మరణ వార్త పై స్పందించారు. లతాజీ ఆదివారం చనిపోత్యే, ఐశ్వర్య మంగళవారం స్పందించారు. లతా మంగేష్కర్‌ ఫోటోని పంచుకుంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ ఆమె ఫోటోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది దీంతో నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఆమెని తిట్టిపోస్తున్నారు. నీకు సిగ్గుందా అంటూ మండిపడుతున్నారు.

లతాజీ ఆదివారం నాడు మరణిస్తే ఇంత ఆలస్యంగా స్పందిస్తారా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మీరు ఒక ఉన్నతమైన కుటుంబానికి కోడలుగా ఉండడమే కాకుండా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యుండి ఆమె మృతికి ఇంత ఆలస్యంగా స్పందిస్తున్నారా… అంటూ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఐశ్వర్య ఫ్యాన్స్‌ మాత్రం ఆమెను వెనకేసుకొస్తున్నారు. తను ఎక్కువగా ఫోన్‌ వాడదని, అందువల్లే లేట్‌గా పోస్ట్‌ పెట్టి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news