Moviesతొలి సినిమాకు రు. 5 ల‌క్ష‌లు.. కొత్త రేటుతో శ్రీలీల‌ పెద్ద...

తొలి సినిమాకు రు. 5 ల‌క్ష‌లు.. కొత్త రేటుతో శ్రీలీల‌ పెద్ద షాకులు ఇస్తోందే..!

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కంట్లో ప‌డిన హీరోయిన్లు ఎవ‌రైనా టాప్ రేంజ్‌కు వెళ్లిపోవాల్సిందే. రాఘ‌వేంద్రుడి క‌న్ను అలాంటిది.. హీరోయిన్ల‌ను అందంగా చూపించే విష‌యంలో ఎంత‌మంది ద‌ర్శ‌కులు వ‌చ్చినా కూడా రాఘ‌వేంద్రుడికి సాటిరాగ‌ల‌వారు ఈ త‌రంలోనూ ఎవ్వ‌రూ ఉండ‌రు. తాజాగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వ‌చ్చిన సినిమా పెళ్లిసందD. ఆర్కా మీడియా వ‌ర్క్స్ – ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గౌరి రోణంకి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా వ‌చ్చింది.

సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్‌, శ్రీలీల హీరో, హీరోయిన్లుగా న‌టించారు. గ‌తేడాది ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాకు ముందు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. అయితే చివ‌ర‌కు ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విజ‌యంలో హీరోయిన్ శ్రీలీల‌కే స‌గం క్రెడిట్ ద‌క్కుతుంద‌ని విమ‌ర్శ‌కులు సైతం మెచ్చుకున్నారు. ఇక శ్రీలీల అందం, అభిన‌యానికి ఫిదా అవుతోన్న యంగ్ హీరోలు, స్టార్ హీరోలు సైతం ఆమెనే త‌మ సినిమాల‌కు రిక‌మెండ్ చేస్తున్నాయి.

వ‌రుస ఛాన్సుల‌తో శ్రీలీల రెమ్యున‌రేష‌న్ కూడా పెంచేసింద‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. పెళ్లిసందD సినిమాకు రు. 5 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న శ్రీలీల రెండో సినిమాకే రు. 40 ల‌క్ష‌లు తీసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా మూడో సినిమాకు సైన్ చేసిన ఆమె ఏకంగా రు. 75 ల‌క్ష‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఒక‌టి రెండు హిట్లు ప‌డితే మ‌ళ్లీ ఆమె కాల్షీట్లు కావాల‌ని అంటే అక్షరాలా కోటి స‌మ‌ర్పించుకోవాల్సిందే.

ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం ఆమెను సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. ఒక‌టి రెండు ఛాన్సులు పెద్ద హీరోల ప‌క్క‌న వ‌చ్చి.. మ‌రో ఒక‌టి రెండు హిట్లు ప‌డితే ర‌ష్మిక లాంటి వాళ్ల‌ను శ్రీలీల డామినేట్ చేసేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news