Moviesచైతన్య పెద్ద గొయ్యి త‌వ్వుతున్నాడు..మరో బిగ్ షాకిచ్చిన సామ్..!!

చైతన్య పెద్ద గొయ్యి త‌వ్వుతున్నాడు..మరో బిగ్ షాకిచ్చిన సామ్..!!

సమంత తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ..పరోక్షంగా అక్కినేని అభిమానులను మాత్రం బాధపెడుతుంది. విడాకుల ముందు వరకు ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. అందరికి ఆదర్శంగా నిలిస్తూ.. భార్య భర్తలు అంటే ఇలానే ఉండాలి..ఇలాగే ఎంజాయ్ చేయాలి..సరదాగా ఆటపట్టించుకోవాలి..ముద్దు ముద్దుగా రొమాంటిక్ గొడవలు వేసుకోవాలి.. అని చేపుతూ పాలు నీళ్లుల కలిసి ఉన్న ఈ జంట.. సడెన్ షాకిస్తూ విడాకులు తీసుకొవడానికి రెడీ అయ్యారు.

ఇక అప్పటి నుండి ఈ జంట ఉప్పు నిప్పుల ప్రతి విషయానికి చిటపటలాడుతున్నారు. ముఖ్యంగా సమంత విడాకుల తరువాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రోజుకో పోస్ట్ పెడుతూ.. డైరెక్ట్ గా కొన్ని ఇన్ డైరెక్ట్ గా కొన్ని..మాటలతో పోస్ట్ లతో ఫోటో లతో అక్కినేని అభిమానులను బాధపెడుతుంది. రీసెంట్ గా సమంత చేసిన పని వల్ల అక్కినేని ఫ్యాన్స్ మరింత హర్ట్ అయ్యారు. ప్లీజ్ సమంత ఇలా చేయకు అంటూ వేడుకుంటున్నారు.

ఆ మధ్య విడాకుల ప్రకటన పోస్ట్ డిలిట్ చేసిన సమంతను చూసి అభిమానులు మళ్ళీ చై-సామ్ కలవబోతున్నారంటూ సంతోషపడ్డారు. వాళ్ల తప్పు ఒప్పులను తెలుసుకుని సరిదిద్దుకుని మళ్లీ మనముందుకు భార్తభర్తలుగా వస్తారు అని అంతా అనుకున్నారు. కానీ ఇక మేము కలిసే అవకాశమే లేదు అన్నట్లు ప్రవర్తిస్తుంది సమంత. రీసెంట్ తన ఇన్స్టా అకౌంట్ నుండి చై కు సంబంధించిన పోస్ట్ ను డిలిట్ చేసింది సామ్. రానా-మిహికా పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ జంట చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

రానా మిహీకా పెళ్లిల్లో వీళ్ళ సందడే ఎక్కువగా ఉన్నింది..హైలెట్ గా నిలిచింది. కాగా అప్పట్లో సమంత చైతన్యను ఉద్దేశించి..”మ‌మ్మీ, ఆంటీస్‌, ఫ్రెండ్స్, సిస్టర్స్ అంద‌రిని పంపిన త‌ర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ టైం వ‌చ్చింది. నా భ‌ర్త చాలా అందంగా క‌నిపిస్తున్నారు క‌దా?( భ‌ర్త ఎక్కడో పెద్ద గొయ్యి త‌వ్వుతున్నాడు) ” అంటూ ఫ‌న్నీ కామెంట్ పెట్టింది. దీనికి స్పందించిన చైతన్య.. ఇదేదో ఇతరుల భాగస్వామ్యంతో చేసిన పెయిడ్‌ పోస్ట్‌లలో ఒకటిగా కనిపిస్తుందంటూ కామెంట్ చేశాడు. అయితే రీసెంట్ గా ఈ పోస్ట్ ను తన అకౌంట్ నుండి డిలిట్ చేసింది సమంత. అంటే ఇక ఆమె నాగచైతన్యను తన భర్త అనుకోవడం లేదు అనేగా..ఇక వాళ్ళు కలిసే ఛాన్సే లేదా అంటూ అభిమానులు ఫీల్ అయిపోతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news