Movies' రౌడీ బాయ్స్ ' హిట్టా... దేవుడా ఈ అరాచ‌కం ఏంటో..!

‘ రౌడీ బాయ్స్ ‘ హిట్టా… దేవుడా ఈ అరాచ‌కం ఏంటో..!

తాను నిర్మించినా, తాను రిలీజ్ చేసినా కూడా ఆ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో ? అన్న దాంతో సంబంధం లేకుండా ప్రెస్‌మీట్లు పెట్టి మ‌రుస‌టి రోజు నుంచే దిల్ రాజు ఆ సినిమాను త‌న ప్రెస్‌మీట్ల‌తో సూప‌ర్ హిట్ చేసేస్తూ ఉంటారు. ఇది ఆయ‌న‌కు అల‌వాటు అయిపోయింద‌న్న టాక్ ఉంది. డీజే సినిమాకు ఆ రోజుల్లోనే రు. 100 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయ‌ని జ‌రిగిన ప్రచారంతో ఇండస్ట్రీ జ‌నాలు షాక్ అయితే.. ప్రేక్ష‌కుల‌కే మైండ్ పోయింది. తాజాగా రాజు ఫ్యామిలీకే చెందిన ఆశీష్ హీరోగా రౌడీ బాయ్స్ సినిమా తెర‌కెక్కింది. సినిమాకు భారీ బ‌డ్జెట్ పెట్టారు. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా తెర‌కెక్కించారు.
హర్ష డైరక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో మళయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. అనుపమని ఇదివరకు ఎప్పుడూ చూపించిన హాట్ యాంగిల్ క‌న‌ప‌డింది. ఇందుకోసం ఆమెకు బాగానే ముట్ట చెప్పార‌ట‌.

 

ఇక బ‌య‌ట ఖ‌ర్చుతో పాటు టెక్నిక‌ల్‌గా కూడా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండానే తీశారు. అయితే సంక్రాంతికి మ‌హేష్ మేన‌ళ్లుడు గ‌ల్లా అశోక్ హీరో మూవీతో పాటు నాగార్జున బంగార్రాజు సినిమాల‌కు పోటీగా ఈ సినిమా వ‌చ్చింది. క‌ట్ చేస్తే రౌడీ బాయ్స్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల‌పడింద‌న్న టాకే ఎక్కువుగా వినిపిస్తోంది. సినిమా 11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో బాక్సాఫీస్ జ‌ర్నీ స్టార్ట్ చేసింది. తొలి రోజు కేవ‌లం రు. 90 ల‌క్ష‌ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా మూడు రోజుల‌కు క‌లుపుకుని రు 2.83 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

డెబ్యూ హీరోకు ఈ స్థాయి వ‌సూళ్లు ఎక్కేవే అయినా.. సినిమా బ‌డ్జెట్‌తో పోలిస్తే ఇవి చాలా చాలా త‌క్కువ అని చెప్పాలి. సినిమాకు ముందు నుంచి భారీ ప‌బ్లిసిటీ చేశారు. పెద్ద‌గా హైప్ లేక‌పోయినా.. ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌తో కాస్త హైప్ తెచ్చారు. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం కూడా పెద్ద‌గా వినిపించ‌లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఇంకా రు. 8 కోట్ల పై చిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టాలి. బంగార్రాజు జోరులో ఆ ఛాన్సులు క‌న‌ప‌డ‌డం లేదు. అస‌లు క్లాస్ సెంటర్ల‌కే ఈ సినిమా ఎక్క‌లేదు. అలాంటిది.. ఈ సినిమా హిట్ అని బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం అంద‌రికి కామెడీగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news