Moviesహైద‌రాబాద్‌లో ప‌వ‌న్ - ఎన్టీఆర్ - మ‌హేష్ రికార్డులు బీట్ చేసిన...

హైద‌రాబాద్‌లో ప‌వ‌న్ – ఎన్టీఆర్ – మ‌హేష్ రికార్డులు బీట్ చేసిన బాల‌య్య‌..!

బాలయ్య తాజా బ్లాక్‌బ‌స్టర్ అఖండ విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. అస‌లు 50 రోజుల పోస్ట‌ర్ చూడడ‌మే గ‌గ‌న‌మ‌వుతోన్న వేళ అఖండ క‌రోనా పాండ‌మిక్ వేళ కూడా ఈ అరుదైన ఫీట్ సాధించింది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటేనే రచ్చరచ్చ అయిపోవాలి. తెలుగునాట ఈ కాంబినేషన్‌పై భారీ ఉంటాయి. గతంలో సింహా, లెజెండ్‌ రెండు సినిమాలు కూడా వీరిద్దరి కాంబినేషన్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ప్రూవ్ చేశాయి. తాజాగా వచ్చిన అఖండ కూడా మాస్ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా అందుకుంది. తొలిరోజు డివైడ్ టాక్ తెచ్చుకున్న అఖండ ఏకంగా 103 కేంద్రాల్లో 50 రోజులు ఆడి ఇంకా చాలాచోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా రు. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టిన అఖండ రు. 80 కోట్లకు పైగా షేర్ రాబట్టి నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ 50 వ రోజు వేడుకలు అంబరాన్ని అంటాయి. కొన్ని థియేటర్లలో అయితే బాలయ్య అభిమానులు అఖండ తొలిరోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ? 50 రోజులు కూడా అలాగే సెలబ్రేట్ చేశారు. ఇక అఖండ యూనిట్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ సినిమా ఆడుతోన్న థియేట‌ర్లో స్పెషల్ షో కు అటెండ్ అయ్యి ఫ్యాన్స్ తో కలిసి ఈ సినిమా మరోసారి ఎంజాయ్ చేశారు.

ఈ క్రమంలోనే అఖండ 50 వ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో 50వ రోజు వ‌సూళ్ల ప‌రంగా చూస్తే ఇప్పటివరకు ఎన్టీఆర్ జై లవకుశ సినిమా 1.8 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ముందు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు 1. 56 లక్షల గ్రాస్ – పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 1. 46 లక్షలు – రాంచరణ్ రంగస్థలం 1. 39 లక్షల గ్రాస్ వసూళ్లు రాబడితే ఇప్పుడు అఖండ‌ ఈ సినిమాల రికార్డులను తిరగరాసి 50వ రోజు ఏకంగా 2.24 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో 50వ రోజు వ‌సూళ్ల‌లో ఇదే అత్యధికంగా నిలిచింది. అఖండ టీం స్పెషల్ షో కు రావడంతో ఆ రోజు ఇక్కడ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. దీంతో ఈ రికార్డు కూడా బాలయ్య ఖాతాలో పడింది. ఇక బాల‌య్య త‌న నెక్ట్స్ సినిమాను మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news