Moviesఅఖండ చూస్తే బాల‌య్య‌ను క‌లిసే బంప‌ర్ ఆఫ‌ర్‌..!

అఖండ చూస్తే బాల‌య్య‌ను క‌లిసే బంప‌ర్ ఆఫ‌ర్‌..!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ హిట్ సినిమా అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కిన ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. థ‌మ‌న్ అందించిన సంగీతంతో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయాయి. తాజాగా ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా 106 థియేట‌ర్ల‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అఖండ ఏకంగా 103 థియేట‌ర్ల‌లో 50 రోజులు ఆడింది. అస‌లు ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో ఏదైనా సినిమా రెండు వారాలు థియేట‌ర్ల‌లో ఆడ‌డ‌మే గ‌గ‌న‌మైపోయింది. అలాంటిది అఖండ ఏకంగా ఇన్ని థియేట‌ర్ల‌లో 50 రోజులు ఆడ‌డం అంటే ఈ సినిమా జ‌నాల‌కు మామూలుగా ఎక్క‌లేదు.

బాల‌య్య ముర‌ళీకృష్ణ అనే రైతు పాత్ర‌తో పాటు అఘోరాగా త‌న న‌ట విశ్వ‌రూపం చూపించేశాడు. అలాగే సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించి మెప్పించాడు. అలాగే పూర్ణ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. ఇక ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవ‌డంతో హైద‌రాబాద్ సుద‌ర్శ‌న్ థియేట‌ర్లో ఈ సినిమా యూనిట్ ఈ వేడుక‌లు కూడా నిర్వ‌హించింది. ఇక అఖండ గ‌త సాయంత్రం నుంచే డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యింది.

ఈ క్ర‌మంలోనే డిస్నీవాళ్లు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ కూడా ఇచ్చారు. జ‌న‌వ‌రి 21వ తేదీ సాయంత్రం 6 గంట‌ల నుంచి జ‌న‌వ‌రి 23వ తేదీ అర్ధ‌రాత్రి వ‌ర‌కు సినిమిను డిస్నీలో చూసిన వారిలో 500 మంది ల‌క్కీ విన్న‌ర్స్‌ను ఎంపిక చేసి వారిని స్వ‌యంగా బాల‌య్య‌తో క‌లిసే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. డిస్నీ వాళ్ల నుంచి ఈ బంప‌ర్ ప్ర‌క‌ట‌న రావడంతో బాల‌య్య అభిమానుల ఆనందం మామూలుగా లేదు. ఇక బాల‌య్య‌ను క‌లిసే ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకోవాల‌నుకునే వారు వెంట‌నే అఖండ సినిమా చూసేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news