Moviesఎన్టీఆర్ ఫ్యాన్స్ మీసం తిప్పే మ్యాట‌ర్‌... ఆ రికార్డు యంగ్‌టైగ‌ర్‌దే...!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీసం తిప్పే మ్యాట‌ర్‌… ఆ రికార్డు యంగ్‌టైగ‌ర్‌దే…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. టెంప‌ర్‌కు ముందు వ‌ర‌కు ఎన్టీఆర్ వ‌రుస ప్లాపుల‌తో ఇబ్బంది ప‌డ్డాడు. ద‌మ్ము, శ‌క్తి, రామ‌య్యా వ‌స్తావ‌య్యా, ర‌భ‌స ఇలా ఏ సినిమా చేసినా డిజాస్ట‌రే అయ్యేది. టెంప‌ర్‌తో ఎన్టీఆర్ ల‌క్ మొద‌లైంది. టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ – జై ల‌వ‌కుశ – అర‌వింద స‌మేత వ‌రుస‌గా ఐదు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇప్ప‌టి త‌రం జ‌న‌రేష‌న్ యంగ్ హీరోలలో ఏ హీరో కూడా వ‌రుస‌గా ఐదు హిట్ సినిమాల‌తో లేడు.

ఒక్క మ‌హేష్‌బాబు మాత్ర‌మే హ్యాట్రిక్ హిట్ల‌తో ఉన్నాడు. ఇక రేప‌టి రోజున ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా కూడా హిట్ అయితే ఎన్టీఆర్ కెరీర్‌లో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టిన హీరోగా చ‌రిత్ర‌లో నిలిచిపోతాడు. ఈ అరుదైన పీట్ అప్ప‌ట్లో సీనియ‌ర్ ఎన్టీఆర్‌, ఆ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవికి మాత్ర‌మే ద‌క్కింది. ఇక ఈ త‌రం జ‌న‌రేష‌న్‌లో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టిన హీరోగా ఎన్టీఆర్ చ‌రిత్ర పుట‌ల్లో నిల‌వ‌నున్నారు.

2015 నుంచి చాలా త‌క్కువ టైంలో ఎన్టీఆర్ ఇన్ని హిట్లు కొట్ట‌డం నిజంగా గ్రేటే. అయితే మ‌ధ్య‌లో త్రిపుల్ ఆర్ సినిమాతో పాటు క‌రోనా రావ‌డంతోనే మూడు సంవ‌త్స‌రాలు వేస్ట్ అయ్యాయి. లేక‌పోతే మ‌నోడు మ‌రో మూడు నాలుగు సినిమాలు చేసేసేవాడు. ఇక త్రిపుల్ ఆర్ త‌ర్వాత కూడా ఎన్టీఆర్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. కొర‌టాల శివ సినిమా, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, ప్ర‌శాంత్ నీల్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇవి కూడా హిట్ అయితే ఎన్టీఆర్‌కు తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు.

ఇక త్రిపుల్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సినిమాలు సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోనున్నారు. కైరా అద్వానీ, జాన్వీక‌పూర్ పేర్లు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news