Moviesడ్రీమ్ హౌస్ కోసం హిమజ అన్ని కోట్లు ఖర్చు చేస్తుందా..హీరోయిన్స్ కూడా...

డ్రీమ్ హౌస్ కోసం హిమజ అన్ని కోట్లు ఖర్చు చేస్తుందా..హీరోయిన్స్ కూడా బలాదూర్..!

హిమజ..ఈ పేరు ముందు చాలా మందికి తెలియకపోయినా..బిగ్‌బాస్ రియాలిటీ గేం షో కు వెళ్ళాక మాత్రం బాగా వినిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో లేడీ కంటెస్టెంట్ హిమ‌జ చేసిన అల్ల‌రి అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ హౌస్ ఇప్పటీ వరకు చాలా మంది లేడీ కంటెస్టేంట్లు ఉన్నా..హిమజ అల్లరి చేసిన్నట్లు ఎవ్వరు చెయ్యలేదు. ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేయ‌డంలో హిమజ‌ ఎప్పుడూ ముందు ఉండేది. బిగ్ బాస్ హౌస్ లో నే కాదు తన ఇంట్లో ను హిమజ చేసే అల్లరి చాలా క్యూట్ గా ఉంటుంది.

 

బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. అభిమానులకు మరింత చేరువ అయ్యింది హిమజ. రోజు తనకు సంబంధించిన వీడియోలను..షూటింగ్ కు సంబంధించిన డీటైల్స్ ను ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది. ఇక రీసెంట్ గా హిమజ తన డ్రీమ్ హౌస్ కట్టుకునే పనిలో నిమగ్నమైంది. గ‌తంలో హిమ‌జ ఓ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం సొంత ఇంటిని నిర్మించుకుంటుంది హిమ‌జ . ఎప్పటి నుండొ కలలుకంటున్న డ్రీమ్ హౌస్ క‌ల ఫైనల్ గా నెరవేరబోతుంది. హిమ‌జ ఓ నాలుగు అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించుకుంటోంది. ప్రస్తుతం ఆ ఇల్లు కన్స్ట్రక్ష‌న్ లో ఉంది. దీనికి సంబంధించిన భూమి పూజ వీడియోను హిమ‌జ యూట్యూబ్ లో షేర్ చేసింది.

ఇక రీసెంట్ గా ఇంటి గురించి వివరిస్తూ హిమజ చేసిన వీడియో నెట్టింట ట్రెండింగ్ గా మారింది. తనకు తన పేరెంట్స్‌ కోసం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే బెడ్‌రూమ్‌ ఏర్పాటు చేశానని చెప్పిన హిమజ.. ఫస్ట్‌ ఫ్లోర్‌ మొత్తం తనకోసమే నిర్మించుకుంటున్నాని చెప్పింది. ఇక అందులో మేకప్‌ రూమ్‌ బ్యూటీకి సంబంధించి న ఐటెంస్ పెట్టుకుంట అని చెప్పుకొచ్చింది. ఇక ధర్డ్ ఫ్లోర్‌లో జిమ్‌ ఏర్పాటు చేసుకుంటా అని ఆపై దాంట్లో థియేటర్‌ ఉండేలా ప్లాన్ చేసుకుంటా అని చెప్పుకొచ్చింది. ఇక ఈ లెక్కన హౌస్ మొతం కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా కోట్లాతో కూడుకున్న పనే అంటున్నారు నెటిజన్స్. ఇంతవరకు హీరోయిన్ లు కూడా ఇలా తమ ఇంటిని ప్లాన్ చేసి కట్టించుకోవడంలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది.

Latest news