Moviesసిల్క్ స్మిత మ‌ర‌ణానికి ఆ హీరోతో ల‌వ్ బ్రేక‌ప్పే కార‌ణ‌మా ?

సిల్క్ స్మిత మ‌ర‌ణానికి ఆ హీరోతో ల‌వ్ బ్రేక‌ప్పే కార‌ణ‌మా ?

సిల్క్ స్మిత అలియాస్ వడ్లపట్ల విజయలక్ష్మి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సిల్క్ స్మిత. మూడున్నర దశాబ్దాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం. గ్లామర్ పాత్రలు పోషిస్తూ అప్పట్లో కుర్రకారు గుండెలు సిల్క్ గిలిగింత‌లు పెట్టేసింది. తన కళ్ళతో సిల్వర్ స్క్రీన్‌కే మ‌త్తెక్కించేసిన సిల్క్ స్మిత అప్పటివరకు కమర్షియల్ సినిమాల ఫార్ములాకు భిన్నంగా పూర్తిగా స్వస్తి పలికేసి తన గ్లామర్‌తో… అందచందాలతో… కళ్ళ కవ్వింతలతో తన పేరుకే ఓ సరికొత్త బ్రాండ్ క్రియేట్ చేసుకుంది.

అప్పట్లో బోల్డ్‌ పాత్రల‌లో నటించడం అంటే పెద్ద సంచలనం. కానీ సిల్క్ స్మిత బోల్డ్ పాత్రలు చేయడంతో పాటు ఐటమ్ సాంగ్ లలో మంచి కిక్ ఇచ్చేది. కేవలం ఆమె ఐటం సాంగులు చూసేందుకే అప్పట్లో కుర్రకారు నుంచి ముసలివారి వరకు సినిమాలకు వెళ్ళేవారు అంటే అతిశయోక్తి కాదు. ఎవ్వరూ ఊహించని విధంగా తక్కువ సమయంలోనే సౌతిండియా సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని పాపులారిటీ సొంతం చేసుకున్న సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ పెద్ద మిస్టరీగా మారింది.

ఆమె తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలీవుడ్ లో అప్పటి అందాల తార దివ్య భారతి మరణం ఎంత మిస్టరీగా మిగిలిపోయిందో ? ఇక్కడ సిల్క్ స్మిత మరణం కూడా అలాగే అంతుచిక్కని మిస్టరీ గా మిగిలిపోయింది. తెలుగులో సిల్క్‌ స్మిత తన తొలి సినిమా బండి చక్రం లో తాను పోషించిన సిల్క్‌ పాత్రనే తన ఇంటి పేరుగా మార్చేసుకుంది. అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో సైతం సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. సిల్క్ ఐటమ్ సాంగ్ ఉంటే ఆ సినిమా బిజినెస్ కూడా మరోలా ఉండేది. అప్పట్లో ఆమె స్టార్ హీరోలతో సమానంగా రెమ్యున‌రేష‌న్‌ తీసుకునేది.

ఇక సిల్క్ ఆత్మహత్య చేసుకోవటానికి అప్పట్లో ఒక సీనియర్ నటుడుతో ఆమె ప్రేమాయణం విఫలం కావడంతో పాటు… ఆ నటుడు సిల్క్ స్మిత మద్యం మత్తులో ఉండగా ఆస్తులన్నీ తన పేరు మీద రాయిం చేసుకున్నాడని… ఆ తర్వాత అతను మోసం చేయడంతోనే డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని అంటారు. అలాగే ఆమె తాను సంపాదించిన ఆస్తి అంతా కొన్ని సినిమాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడం ఆ తర్వాత ఆమె మద్యానికి బానిస కావడంతో జీవితం చిన్నాభిన్నం అయింది.

చివరకు ఆమె 1996 సెప్టెంబర్ 23న తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కొవ్వలి. ఏదేమైనా వెండితెరపై తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సమానంగా ఒక వెలుగు వెలిగిన సిల్క్ మరణం ఇప్పటికీ సమాధానం లేని ఎన్నో సందేహాలు, ప్రశ్నలు మిగిల్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news