Moviesవిడాకుల బాట‌లో ఇద్ద‌రు టాలీవుడ్ డైరెక్ట‌ర్లు... ఓ హీరో.. ?

విడాకుల బాట‌లో ఇద్ద‌రు టాలీవుడ్ డైరెక్ట‌ర్లు… ఓ హీరో.. ?

సినిమా ప్ర‌పంచం అనేది పెద్ద మాయా ప్ర‌పంచం. ఇక్క‌డ ఎప్పుడు ఎవ‌రు క‌లిసి ఉంటారో ? ఎప్పుడు విడిపోతారో ? కూడా తెలియ‌దు. ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకున్న దంప‌తులు కూడా విడిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌తేడాది చివ‌ర్లో అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత విడిపోయి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చారు. ఇక సుస్మితాసేన్ – రోహ్మ‌న్ కూడా బ్రేక‌ప్ చెప్పేసుకున్నారు. తెలుగు బుల్లితెర పాపుల‌ర్ జంట ష‌ణ్ను – సిరి మ‌ధ్య కూడా బ్రేక‌ప్ అయిపోయింది. అమీర్‌ఖాన్ త‌న భార్య కిర‌ణ్‌రావుకు విడాకులు ఇచ్చేశాడు. ఇక తాజాగా ధ‌నుష్ – సౌంద‌ర్య కూడా విడాకులు తీసుకున్నారు.

ఈ విడాకులు, బ్రేక‌ప్‌ల వార్త‌ల‌తో ఇప్పుడు మీడియా అంతా నానుతుంటే ఇప్పుడు మ‌రి కొంద‌రు సినీ సెల‌బ్రిటీలు కూడా విడాకులకు రెడీ అవుతున్నార‌న్న వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇవి ఇప్పుడే కాదు.. గ‌త కొంత కాలంగా కూడా వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడిపోతున్నారన్న ప్రచారం ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద వైర‌ల్ అవుతోంది. గ‌త కొంత కాలంగా వీరు దూరం దూరంగానే ఉంటున్నార‌ట‌.

ఇక క‌ళ్యాణ్ దేవ్ కూడా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటోన్న ప‌రిస్థితి. ఇటీవ‌ల త‌న సినిమాలు రిలీజ్ అయిన‌ప్పుడు కూడా మెగా కాంపౌండ్ నుంచి క‌నీస స్పంద‌న లేదు. ఇక శ్రీజ ఈ వార్త‌లు ఖండించ‌లేదు స‌రిక‌దా.. త‌న ఇన్‌స్టాలో క‌ళ్యాణ్ ఫొటోలు తీసేస్తోన్నారు. ఇక టాలీవుడ్ నుంచే మ‌రో యువ హీరో కూడా త‌న భార్య‌కు విడాకులు ఇచ్చేయ‌బోతున్న‌ట్టు టాక్ ?

ఈ యంగ్ హీరో సంగ‌తి ప‌క్క‌న పెడితే టాలీవుడ్‌లో ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్లు కూడా హీరోయిన్ల‌తో ఎఫైర్ల కార‌ణంగా త‌మ భార్య‌ల నుంచి విడిపోతున్నార‌న్న వార్త‌లు గ‌త కొంత కాలంగా గుప్పుమంటున్నారు. ఓ స్టార్ డైరెక్ట‌ర్‌కు వ‌రుస హిట్లు ఉన్నా కూడా.. త‌న సినిమాల్లో ప‌దే ప‌దే ఒకే హీరోయిన్‌ను రిపీట్ చేస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఆ ద‌ర్శ‌కుడి వైఖ‌రితో అత‌డి భార్య విసిగిపోయి ఉంద‌ని.. స‌ద‌రు డైరెక్ట‌ర్ భార్య టార్చ‌ర్ ప‌డ‌లేక విడిపోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని టాక్ ?

ఇక మ‌రో డైరెక్ట‌ర్ సైతం విడాకుల బాట‌లోనే ఉన్న‌ట్టు ఇండ‌స్ట్రీలో వార్త‌లు జోరుగా గుప్పుమంటున్నాయి. కొద్ది రోజులు ఆగితే ఈ సినీ సెల‌బ్రిటీల విడాకుల వార్త‌లు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని అంటున్నారు. ఏదేమైనా ఇగోలు, ఎవ్వ‌రూ స‌ర్దుకుపోక‌పోవ‌డం లాంటి కార‌ణాల‌తో ఈ సెల‌బ్రిటీల దాంప‌త్య జీవితాలు విచ్ఛిన్న‌మ‌వుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news