Moviesవామ్మో..అల్లు అరవింద్ కు 40 కోట్లు బొక్క..ముంచేశాడుగా..?

వామ్మో..అల్లు అరవింద్ కు 40 కోట్లు బొక్క..ముంచేశాడుగా..?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఆయనది ప్రత్యేకమై స్థానం. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్య వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఈయన.. నటుడిగా కంటే నిర్మాతగానే బాగానే పాపులర్ అయ్యారు. దివంగత నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అరవింద్ తొలుత నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత గీతా ఆర్స్ట్ నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించారు.

 

ముఖ్యంగా చిరంజీవి మెగాస్టార్ కావడం వెనక.. అల్లు అరవింద్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉందని అందరు చెప్పుకుంటూ ఉంటారు. అల్లు అరవింద్ ప్లానింగ్ అంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందనే పేరు వచ్చింది. గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను రూపొందించారు.ఆయన ముగ్గురు కుమారుల్లో ఇద్దరు హీరోలుగా చెలామణి అవుతున్నారు. రెండో కొడుకు అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడో కుమారుడు అల్లు శిరీష్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇక ఆహా అంటూ తెలుగు కంటెంట్‌తో మంచి విజయం అందుకున్నారు.

ఇక ఇప్పటి వరకు ఈయన నిర్మించిన సినిమాల్లో దాదాపు 90 శాతం విజయాలున్నాయంటే అల్లు అరవింద్ జడ్జిమెంట్ ఏంటో అర్థమవుతుంది. ఈయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వేల మందికి ఉపాదిని కల్పిస్తున్నాయి. ఐకానిక్ స్టార్​ అల్లు అర్జున్​ కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి హిట్​ కొట్టిందో తెలిసిందే.’అల వైకుంఠపురములో’ మూవీని హిందీలో కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అనీ అనుకున్నట్లు జరిగుంటే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి ఉండాలు. అనుకోని కారణాల చేత విడుదల లేట్ అయిన ఈ సినిమా డబ్బింగ్​ వెర్షన్​ను థియేటర్లలో రిలీజ్​ చేయడాన్ని ఆపేశారు.

ఈ సినిమాను రిమేక్​ చేస్తున్న నిర్మాతలకు, డబ్బింగ్​ నిర్మాతలకు మధ్య అభిప్రాయ బేధాలు కుదరకపోవడంతో సినిమా విడుదలను మానుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ‘షెహజాదే’ నిర్మాతల్లో అల్లు అరవింద్​ కూడా ఒకరు. ఇప్పటివరకూ ‘షెహజాదే’ చిత్రీకరణకు అయిన ఖర్చు రూ. 40 కోట్లు అంటూ మ్యాటర్ లీక్ అయ్యింది. ఈ సినిమాను విడుదల చేస్తే తనకు రూ. 20 కోట్లు ప్రాఫిట్​ వచ్చేదని, కానీ తనకు తెలిసిన నిర్మాతలకు నష్టం రాకూడదనే ఈ సినింజా రిలీజ్​ చేసే ఆలోచనని మానుకున్నాను అని మనీష్​ షా తెలిపారు. అలాగే అల్లు అరవింద్​ రూ. 40 కోట్లు నష్టపోవడం తనకు ఇష్టం లేదని అందుకే ఈ సినిమాను ‘దించాక్’​ టీవీ ఛానెల్​లో మాత్రమే రిలీజ్​ చేస్తున్నట్లు ప్రకటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news