Moviesరష్మిక అంతలా భారీగా పెంచడానికి కారణం బన్నీ నా..?

రష్మిక అంతలా భారీగా పెంచడానికి కారణం బన్నీ నా..?

ప్రస్తుతం తెలుగులోనే కాక నేషనల్ వైడ్‌గా స్టార్ హీరోయిన్ గా తన సత్త చాటుతున్న భామ రష్మిక. టాలీవుడ్ లో ప్రస్తుతం రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో అందాల భామ రష్మిక ఒకరు. తన క్యూట్ క్యూట్ లూక్స్ తో టాలీవుడ్ లో రష్మిక ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. రష్మిక మంధన.. చేసింది కొన్ని సినిమాలే అయినా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్. తన అందంతో, నటనతో కుర్రకారును ఫిదా చేసింది. మంచి మంచి సినిమా స్టోరీస్ సెలెక్ట్ చేసుకుని.. బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ..బంపర్ ఆఫర్స్ కొట్టేస్తుంది ఈ చిన్నది. పుష్ప మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధన జంటగా నటించడంతో ప్రస్తుతం అల్లు అర్జున్ పేరుతో పాటు ఆమె పేరు అంతటా మార్మోగిపోతోంది.

వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ కన్నడ భామకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు క్యూకట్టాయి. ముందు నుంచే కన్నడ బ్యూటీ రష్మికకు కన్నడ, టాలీవుడ్ సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు ఉంది. పుష్ప మూవీతో తమిళం, మళయాళం చిత్ర పరిశ్రమల ఆడియెన్స్‌కి సైతం దగ్గరవుతోంది. అలాగే ఇదే సినిమాతో ఉత్తరాన బాలీవుడ్ ఆడియెన్స్‌ని కూడా పలకరించనుంది. అలా అన్ని భాషల్లోనూ ప్రస్తుతం రష్మిక మంధన హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.

ఇదిలావుంటే, అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన పుష్ప మూవీ డిసెంబర్ 17న విడుదల అయ్యి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బన్నీ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ నెలకొల్పింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక కు సైతం ఆఫర్లు భారీగానే వస్తున్నాయి. క్షణం కూడా తీరికలేకుండా వరుస సినిమాలకుకమిట్ అవుతుంది ఈ కన్నడ సోయగం. ఇక దీపం వెలుగుతున్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనుకుంది ఏమో కానీ అమ్మడు తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిందట.

ఇప్పటి వరకు సినిమాకి 2-3 కోట్లు తీసుకునే రష్మిక ..ఆ సంఖ్య ని అమాంతం డబుల్ చేసిందట. ఇప్పుడు ఒక్క సినిమాకే 4-5 కోట్లు అడుగుతుందట. ఇక దీనికి ప్రధాన కారణం పుష్ప సినిమానే అంటున్నారు విశ్లేషకులు. బన్నీ పక్కన నటించడం రష్మికకు ఒక్క ప్లస్ పాయింట్ అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం అమ్మడు పాత్రకు మంచి రెస్పానస్ రావడంతో పారితోషకాని పెంచేసిన్నట్లు చెప్పుకోస్తున్నారు పలువురు ప్రముఖులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news