Moviesబాబోయ్..నాని కోసం అన్నీ కోట్లు ఖర్చు చేస్తున్నారా.. శ్రీకాంత్‌ ప్లాన్ మామూలుగా...

బాబోయ్..నాని కోసం అన్నీ కోట్లు ఖర్చు చేస్తున్నారా.. శ్రీకాంత్‌ ప్లాన్ మామూలుగా లేదుగా..?

గత కొంత కాలంగా ఒక్క హిట్ కోసం వేచి చూస్తున్న నానికి శ్యామ్ సింగ రాయ్ రూపంలో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. లుక్ పరంగా .. యాక్టింగ్ పరంగా కూడా ఈ సినిమా ఆయనకి ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టడంతో పాటు నానికి మంచి పేరుని సంపాదించిపెట్టింది. ఇటీవల ఓటీటీలో విడుదలై అక్కడ కూడా రికార్డు సృష్టించింది. ఇక ఈ మూవీ తర్వాత ‘అంటే సుందనానికి..’పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టాడు నాని. ఇటీవల షూటింగ్‌ కూడా కంప్లీట్‌ చేశాడు.

అంటే సుందరానికి సినిమాలతోపాటు దసరా సినిమా చేస్తున్నాడు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో నాని రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నారు. తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు. సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.

ఈ సినిమా కోసం కొన్ని కోట్లు ఖర్చు చేసి ప్రతేకంగా విలేజ్‌ సెట్‌ని ఏర్పాటు చేయబోతున్నారట డైరెక్టర్. దీని కోసం ఏకంగా రూ.12 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 12 ఎకరాల్లో ఈ భారీ సెట్‌ని ఏర్పాటు చేస్తున్నారట. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే ‘శ్యామ్‌ సింగరాయ్‌’కోసం కోల్‌కతా సెట్‌ని తీర్చిదిద్దిన ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కొల్ల ఈ సెట్‌ని కూడా రూపొందించబోతున్నారు. ఇక ఈ సినిమాలోని కీలక సన్నీవేశాలను అన్నీ కూడా ఈ భారీ సెట్‌లోనే చిత్రీకరించబోతున్నట్లు లీక్ అవుతున్న సమచారం బట్టి తెలుస్తుంది.. ఈ చిత్రానికి తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news