Moviesఅతడు సినిమా చేసేటప్పుడు అంత పెద్ద గొడవ అయ్యిందా..?

అతడు సినిమా చేసేటప్పుడు అంత పెద్ద గొడవ అయ్యిందా..?

టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలో నటించారు. ఇక ఆయన సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ఏదైనా ఉంది అంతే అది “అతడు” సినిమానే. తన కెరీర్లో క్లాస్ కంటెంట్ తో చేసిన మాస్ మూవీ ‘అతడు’. మహేశ్ కెరీర్లోనే క్లాసిక్ గా నిలిచిపోయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘అతడు’. దర్శకుడిగా త్రివిక్రమ్‌కు ఇది రెండో సినిమా. ఈ సినిమా టాలీవుడ్‌లో క్లాసిక్ థ్రిల్లర్‌గా నిలిచిపోయింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు కనెక్ట్ అవ్వని ఏరియా, ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా 2005 ఆగష్టు 10న విడుదలైంది. ఈ సినిమాలో నిజమైన హీరో అంటే త్రివిక్రమ్ అని చెప్పాలి.

మాటల మాంత్రికుడు అని ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో స్థిరపడిపోవడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. కథ, స్క్రీన్ ప్లే, టేకింగ్, మాటలు, యాక్షన్.. ఇలా ప్రతి విభాగంలో త్రివిక్రమ్ మార్క్ ప్రత్యేకం. ఈ కథకు తనదైన నటనతో, స్టైల్, యాక్షన్ తో మెప్పించాడు మహేశ్. హీరోయిన్ గా త్రిష అందం, చిలిపి నటన సినిమాకు బోనస్.

అప్పటివరకూ మహేష్ బాబు చేసిన సినిమాలు ఒకెత్తు… ఈ సినిమా ఒకెత్తు.. ఎందుకంటే అప్పటివరకు మహేష్ బాబు సినిమాలన్నీ ఓ మూసధోరణిలోనే వెళ్తున్నాయి.. అందులోనూ మురారి సినిమా తర్వాత మళ్ళీ ఫ్యామిలీ కథలను ఎప్పుడు టచ్ చేయలేదు మహేష్.. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ఈ అతడు సినిమా అని వర్గాల ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ టైంలో ఓ పెద్ద గొడవ జరిగిందట. ఈ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. త్రిష తన అందం గురించి పొగుడుతూ మహేష్ బాబు దగ్గర బిల్డప్ ఇస్తుంది. ఇక దీంతో మహేష్ త్రిష కు కౌంటర్ ఇస్తూ నువ్వు ఏం అంత అందంగా లేవు అని అంటాడు. ఇక ఆ సీన్ లో ఆడవాళ్లంత అందంగా ఉంటారు అని అక్కడున్న లేడీస్ అంటుంటే..లేదు కాదు అని మగవాళ్లు వాదిస్తారు.

నిజానికి అక్కడ ఆ సీన్ షూటింగ్ అయిపోయాక కూడా వాళ్ల మధ్య ఈ ఫన్నీ డిస్కషన్ నడిచిందట. ఇక ఆ మాటల్లో టీం మెంబర్స్ అయిన ఆడవాళ్లు ..మగవాళ్లు మధ్య ఓ పెద్ద గొడవే జరిగిందట. ఇక మనం తెర పై చూసినంత ఈజీగా అయితే ఈ సినిమా షూట్ చేయలేదట. ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డారట త్రివిక్రమ్‌-మహేష్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news