Movies"పుష్ప"రాజ్ కు మేకప్ వేయడానికి అన్ని గంటలు పడుతుందా..?

“పుష్ప”రాజ్ కు మేకప్ వేయడానికి అన్ని గంటలు పడుతుందా..?

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిపోయారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ‘పుష్ప’. ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’.రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ సినిమా తొలి భాగం డిసెంబర్‌ 17న విడుదల అవుతోంది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌. ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి.కేవ‌లం టాలీవుడ్‌లో మాత్ర‌మే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సింగిల్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

పుష్ప‌రాజ్ పాత్ర‌లో న‌టిస్తోన్న బ‌న్నీ ప‌వ‌ర్ ఫుల్ గా న‌టించిన‌ట్టు తెలుస్తోంది. ఇక సుకుమార్ టేకింగ్‌, బన్నీ మాస్ మేకోవ‌ర్ , ర‌ష్మి క గ్లామ‌ర్ అప్పీరి యెన్స్ , దేవిశ్రీ సంగీతం సినిమాకు హైలెట్ కానున్నాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతూ ఉండ‌డంతో బ‌న్నీ ఫ్యాన్స్ కోలాహాలం మామూలుగా లేదు. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్లతో మూవీ టీం ఫుల్‌ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అల్లు అర్జున్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. పుష్ప కోసం చాలా కష్టపడ్డామని, అటవీ ప్రాంతాల్లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.

ఇక ఈ సినిమాలో అందరిని ఆకట్టుకుంది వీళ్ల గెటప్స్. ఇందులో అల్లు అర్జున్ హెయిర్ – కనుబొమ్మలు – గడ్డం మీసాలతో సహా ప్రతి విషయం కూడా రోజువారీ కార్మికుడిని గుర్తు చేసే విధంగా ఉంటాయి. ఇక ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రకు కు మ్యాకప్ కు ఎంత టైం పడుతుంది అనే ప్రశ్నకు బన్నీ జవాబు ఇస్తూ..” ఈ సినిమా లో రోజూ సుమారు రెండు గంటలపాటు మేకప్ కోసమే కేటాయించాల్సి వచ్చేది. తెల్లవారుజామున 4.30 నిద్రలేచి.. ఐదుకల్లా సెట్‌కెళ్లి.. 5 నుంచి 7 వరకూ మేకప్‌ కోసమే ఓపిగ్గా కూర్చొవాలి. షూట్‌ పూర్తయ్యాక మేకప్ తీయడానికి మరో 20 నుంచి 40 నిమిషాలు. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఇంతటి మేకప్‌ అవసరం రాలేదని, చాలా మినిమల్‌ మేకపే వాడామని” చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news