Moviesఅలియా భట్ రాజమౌళి కాళ్ళు మొక్కడానికి కారణం ఇదే..!!

అలియా భట్ రాజమౌళి కాళ్ళు మొక్కడానికి కారణం ఇదే..!!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ . ఈ సినిమా కోసం కోట్లాది మంది అభిమానులతో పాటు స్టార్ సెలబ్రిటీస్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 7న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఇక ఈ ట్రైలర్ చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతోన్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ట్రైలర్ విడుదల చేయడంతో ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది.

ప్రస్తుతం యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. ఎలివేషన్స్‌లో రాజమౌళిని మించిన మాస్ డైరెక్టర్ లేరంటూ పొగిడేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అలియా భట్, రాజమౌళి, అజయ్ దేవగణ్, ఎన్టీఆర్, దానయ్య కలిసి పాల్గొన్నారు. అయితే రాజమౌళి, అలియా భట్ పక్కపక్కనే కూర్చున్నారు.

ఇక అలియా భట్ ఒకానొక సమయంలో కాలు మీద కాలు వేసుకుని కూర్చునేందుకు ట్రై చేసింది. ఆ సమయంలో పొరపాటున రాజమౌళికి అలియా భట్ కాళ్లు తగిలాయి. దీంతో వెంటనే ఆమె ఏ మాత్రం గర్వలేని మంచి మనిషిలా రాజమౌళి కాళ్లకు దండం పెట్టబోయింది. దీంతో రాజమౌళి వద్దు వద్దు అంటారు. మొత్తానికి ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశంలోనే నంబర్ 1 హీరోయిన్ ఆలియా భట్ సంస్కారానికి సలాం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తు్నారు. ఈ చిత్రంలో ఆలియాభట్ సీతగా నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news