Moviesశృతీహాస‌న్ క‌న్నీళ్లు.. అంత బాధ‌కు కార‌ణం ఇదే...!

శృతీహాస‌న్ క‌న్నీళ్లు.. అంత బాధ‌కు కార‌ణం ఇదే…!

ప్రపంచవ్యాప్తంగా గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ ప్రతి రంగాన్ని ఎంత అతలాకుతలం చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడిప్పుడే ప్రపంచం కాస్త క‌రోనా నుంచి కోలుకుని కుదుటపడుతుంది.. అనుకుంటున్న సమయంలో ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్ మరోసారి ప్రపంచాన్ని టెన్షన్ పెట్టేస్తుంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా దెబ్బతో అందరూ తీవ్రంగా నష్టపోయారు. క‌రోనా దెబ్బ‌తో ఎంతోమంది మేధావులను సైతం ప్రపంచం కోల్పోయింది. మరెంతో మంది సెలబ్రిటీలు కరోనా కాటుకు బలయ్యారు… ఎంతోమంది తమ సన్నిహితులను, అభిమానులను, శ్రేయోభిలాషులను కూడా కోల్పోవాల్సి వచ్చింది.

ఎందరో జీవితాలను కరోనా అల్లకల్లోలం చేసేసింది. ఓ వైపు కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఉన్నాకూడా కొత్త వేరియంట్లు కరోనా జోరుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్‌లో ఎంతో మంది సినీ ప్రముఖులు సైతం మృతి చెందిన సంగతి తెలిసిందే. మరి కొందరు సినీ ప్రముఖులు తమ సన్నిహితులను కోల్పోయారు. కరోనా కారణంగా కూడా ఎంతో కోల్పోయానని స్టార్ హీరోయిన్ శృతిహాసన్ చాలా ఎమోషనల్ గా చెప్పింది.

విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తె అయిన శృతిహాసన్ సౌత్ ఇండియాలో తెలుగుతో పాటు తమిళంలో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం బాలయ్య హీరోగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్‌ చేసింది.

ఇటీవల కమల్‌కు కూడా కరోనా సోకింది. చికిత్స అనంతరం ఆయన ఈ ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడ్డారు. తన తండ్రికి కరోనా సోకిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. ఇంకా కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గలేదని… ఎవరు కూడా ఈ వైరస్‌ను తేలిగ్గా తీసుకోవద్దని శృతిహాసన్ చెప్పింది.
తన తండ్రి కరోనా నుంచి కోలుకుని విక్రమ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు అని… చెప్పిన శృతి కరోనా వల్ల తన ఫ్రెండ్‌ను సైతం కోల్పోయినప్పుడు చాలా బాధ కలిగింది అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.కరోనా వైరస్ ఎలా వస్తుందో ? కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉందని.. అందుకే ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి శృతి చెప్పింది. ఇక ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శాంతాను హ‌జారికాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడితో కలిసి ముంబైలో సహజీవనం చేస్తున్న ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news