Moviesథ‌మ‌న్ ముందు దేవిశ్రీ ఇంత‌లా తేలిపోతున్నాడా..!

థ‌మ‌న్ ముందు దేవిశ్రీ ఇంత‌లా తేలిపోతున్నాడా..!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఇద్దరు సంగీత దర్శకులు రాజ్యం నడుస్తోంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ ఇద్దరు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న అందరు స్టార్ హీరోల సినిమాలకు అయితే దేవిశ్రీ లేదా థ‌మ‌న్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మ్యూజిక్ ఇస్తున్నారు. గత కొన్నేళ్ళుగా ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లలో ఎవరు నెంబర్ వన్ అని చెప్పేందుకు కూడా వీలు లేకుండా ఉండేది. ఎవరికివారు పోటాపోటీగా బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈ పోటీలో ఇప్పుడు దేవిశ్రీని థ‌మ‌న్ క్రాస్ చేసి నెంబర్ వన్ స్థానానికి వెళ్లిపోయినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం థమ‌న్ టైం నడుస్తుంది.. థ‌మ‌న్‌ను ఎవరు ఆపే పరిస్థితి లేదు.

రెండేళ్లుగా థ‌మన్ దేవిశ్రీ కంటే టాప్ ఆల్బమ్‌లు ఇస్తున్నాడు. రెండేళ్ల క్రితం సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో – సరిలేరు నీకెవ్వరు రెండు సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సినిమాల్లో అల వైకుంఠపురంలో పై చేయి సాధించింది. ఇందుకు ప్రధాన కారణం థ‌మ‌న్‌ ఇచ్చిన మ్యూజిక్ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంలో సగం పాత్ర థ‌మ‌న్‌ది ఉంది.

అలాగే సరిలేరు నీకెవ్వరు సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ పెద్ద మైనస్ అయింది. ఇక ఇప్పుడు చూస్తే బాలయ్య అఖండ సినిమాకు థ‌మ‌న్‌ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. అఖండ విజయంలో థ‌మ‌న్‌ పాత్ర కూడా చాలా వరకు ఉంది. థ‌మన్ కంటే ముందే దేవిశ్రీప్రసాద్ టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగారు. ఎప్పుడూ అయితే థ‌మ‌న్ త‌న త‌డాఖా చూపించడం మొదలు పెట్టాడో ? అప్పటి నుంచి థ‌మ‌న్ టాప్ ప్లేసులోకి వచ్చారు.

పైగా ఇటీవల దేవిశ్రీ సంగీతం ఆయన అభిమానులకే ఎంతమాత్రం నచ్చటం లేదు. ప్రస్తుతం దేవిశ్రీ చేతిలో ఉన్న ఒకే ఒక పెద్ద సినిమా పుష్ప‌. ఆ సినిమా తర్వాత అత‌డికి పెద్ద సినిమాలు లేవు. ఏదేమైనా ఇప్పుడు థ‌మ‌న్ హ‌వా న‌డుస్తోంది అంతే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news