Moviesఅలా మాట్లాడడం సరి కాదు.. రాజమౌళి ఇచ్చిపడేసాడుగా..!!

అలా మాట్లాడడం సరి కాదు.. రాజమౌళి ఇచ్చిపడేసాడుగా..!!

సినిమా ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మూవీ ఆర్ఆర్ఆర్ మరి కొద్ది రోజులో మనముందుకు రాబోతుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజ‌మౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ జ‌న‌వ‌రి 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఇక జ‌క్క‌న్న తన టీమ్‌తో కలిసి జెట్ స్పీడ్‌తో అన్ని ప్రాంతాల్లో ప్రెస్ మీట్‌లు పెట్టేస్తున్నాడు.

మేకింగ్ మాత్రమే కాదు మూవీ ప్రమోషన్స్‌లోనూ రాజమౌళి స్పెషలిస్ట్ అనే చెప్పాలి. సినిమా తెరకెక్కించడానికి ఎంత కష్టపడుతారో… దాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు అంతే ఎఫర్ట్స్ పెడుతారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో జక్కన్న అండ్ టీమ్ బిజీ బిజీగా గడుపుతున్నారు.ముంబై, బెంగళూరు, చెన్నై ఇలా ఏరియాలను ఎంతో స్పీడ్‌గా కవర్ చేస్తోంది ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్. జూనియర్‌ ఎన్టీఆర్, అజ‌య్ దేవ్ గ‌న్ రాంచరణ్, అలియా భట్‌తో పాటు రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీమ్ అన్ని సిటీల్లో ప్రెస్‌ మీట్‌లతో బిజీగా ఉంది.

కాగా ఈ ప్రెస్ మీట్ లల్లో రాజమౌళి ని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక ఆయ‌న‌కు రీసెంట్‌గా మ‌హేష్ సినిమాకు సంబంధించి ప్ర‌శ్న ఎదురైంది. మ‌హేష్ బాబు సినిమా గురించి విలేక‌రి ప్ర‌శ్నించ‌గా రాజమౌళి రెస్పాండ్ అవుతూ ఆర్ఆర్ఆర్ సినిమా సందర్భంలో ఆ ప్రాజెక్ట్ కోసం మాట్లాడడం సరి కాదని ఈ సినిమా సక్సెస్ అంతా అయ్యిపోయిన తర్వాత ఆ సినిమా కోసం మాట్లాడుకుందాం అని తనదైన శైలిలో స‌మాధానం ఇచ్చారు. కాగా రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది అని ఎప్పుడో ప్రకటించారు. ఇక ఈ సినిమా గురించిన అప్డేట్స్ కోసం మహెష్ అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి వాళ్ళ ఆశ ఎప్పుడు నెరవేరుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news