Moviesఎలిమినేట్ అవుతూ కాజల్.. షణ్ముఖ్ తో ఏమందో తెలుసా..?

ఎలిమినేట్ అవుతూ కాజల్.. షణ్ముఖ్ తో ఏమందో తెలుసా..?

బిగ్ బాస్ జీహన్ 5 ముగుఇంపు దశకు వచ్చేసింది. ఇప్పటివరకు బిగ్‌బాస్‌ షోలో ఉన్న హౌస్‌మేట్స్‌ ఎన్నోవారాలు నామినేషన్‌లో ఉన్నారు. సేవ్ అవుతూ వచ్చారు. నామినేట్ చేసినందుకు తిట్టుకున్నారు,పోట్లాడుకున్నారు. కొందరైతే ఎన్నోవారాలు ఎలిమినేషన్‌ చివరి అంచుల వరకు వచ్చి లాస్ట్ మూమెంట్ లో సేవ్‌ అయ్యారు.

అభిమానులు కూడా వాళ్లకు ఓ రేంజ్ లో ఓట్లు వేసి సేవ్ చేస్తున్నారు. అయితే ఇన్ని రోజులు బిగ్ బాస్ లో ఉండడం ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్లుగా ఉంది. ఈ ఒక్కవారం మాత్రం హౌస్ మేట్స్ తలరాత మార్చనున్నారు ఆడియన్స్. ఏ కంటెస్టెంట్ ను ఫినాలేకు పంపాలి? ఎవరికి ఓటు వేయకుడదు ? అని డిసైడ్‌ చేయనుంది.

ఈ 14వ వారం హౌస్ లోని అందరు నామినేట్ అయ్యారు ఒక్క శ్రీరామ చంద్ర తప్పా. మానస్‌, సిరి, షణ్ను, కాజల్‌, సన్నీ.. ఐదుగురూ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో షణ్ను, సన్నీ సేవ్‌ అవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షణ్ను, సన్నీలకు భారీ ఎత్తున ఓట్లు నమోదవుతున్నాయని సమాచారం. మానస్‌కు కూడా బయట ఫాలోయిగ్ బాగానే ఉండడంతొ ఓట్లు బాగానే పడుతున్నాయి.

ఇక సిరి, కాజల్‌లో ఒకరు ఎలిమినేట్‌ అవుతారని మొదటి నుంచీ అంతా ఫిక్స్ అయిపోయారు. కాగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి కాజల్ ఎలిమినేట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది.

కాజల్ ముందు నుండి కూడా టాప్ 5 లో ఉండాలని గట్టిగా ప్రయత్నించింది. టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలవాలని కలలుగన్న ఈమె.. అది తీరకుండానే బయటకు వచ్చేసింది. ఈవారం కాజల్ ఎక్కువగా డబుల్ గేమ్ ఆడిందనే విమర్శలు బాగా వచ్చాయి. ముఖ్యంగా సన్నీ, మానస్ దగ్గర కేవలం ఓటింగ్ కోసమే ఫ్రెండ్‌షిప్‌ చేసినట్లు ఈమెపై సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

పైగా ముగ్గురు ఈసారి నామినేషన్‌లో ఉండటంతో.. కాజల్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయింది. అయితే, హౌస్ నుండి బయటకు వచ్చేస్తూ అందరి హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ.. షన్ను తో కూడా మాట్లాడుతూ..”నువ్వు ముందులాగే నాతో మాట్లాడుతుంటే బాగుండు షణ్ముఖ్. నువ్వు నీ కోపాని కొంచెం తగ్గించుకుని గేం పై దృష్టి పెట్టుంటే బాగుండేది. బయటకు వచ్చాక అయినా నువ్వు మారుతావ్ అనుకుంటున్న ..అంటూ అందరికి ఆల్ ది బెస్ట్” అంటూ చెప్పుకొచ్చిందట. ఇక ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం సన్నీ నే కప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news