Moviesవామ్మో..పుష్ప ఐటెం సాంగ్ మొత్తం ఆ పాట నుండి కాపీ కొట్టారా..?

వామ్మో..పుష్ప ఐటెం సాంగ్ మొత్తం ఆ పాట నుండి కాపీ కొట్టారా..?

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ కెరీర్ లో మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులలో కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ప్రత్యేకంగా ఉండేలాగా చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది. అన్ని హంగులతో రెడీ అయ్యిన ఈ చిత్రం టోటల్ బిజినెస్ ఓ రేంజ్‌లో అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో థియేట్రికల్‌తో పాటు నాన్ థియేట్రికల్ హక్కులు, ఓటిటి హక్కులు కలిపి దాదాపు 250 కోట్లు బిజినెస్‌ జరిగిందని అంటున్నారు. ఇక ఈ సినిమా మొత్తం 5 భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కకుతుండడంతో అభిమానులంతా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు.

తాజాగా ఈ చిత్రం నుండి విడుదలైన ఐటెం సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. “ఉ అంటావా మావ..ఊ ఊ అంటావా” అంటూ సాగే ఈ పాట అభిమానులకు ఎంతగానో నచ్చింది. అయితే ఇప్పుడు ఆ పాట కొంతమంది నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ పాటను కాపీ వివాదంలో చిక్కుకోవడం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌‌గా మారింది. అయితే ఈ కాపీకి కారణం హీరో అల్లు అర్జున్ కానీ, డైరెక్టర్ సుకుమార్ కానీ కాదు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.

పాటలోని మ్యూజిక్ డీఎస్‌పీ కాపీ చేశాడంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన వీడొక్కడే సినిమాలోని హానీ.. హానీ పాటకి కాపీలా ఈ సాంగ్ ఉంద‌ని ట్రోల్ చేస్తున్నారు. ఈ రెండు సాంగ్స్ ఒకేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి దీనిపై చిత్ర యూనిట్ ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news