Moviesసిరివెన్నెల సీతారామశాస్త్రి పాడిన మొదటి పాట ఏంటో తెలుసా..?

సిరివెన్నెల సీతారామశాస్త్రి పాడిన మొదటి పాట ఏంటో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల.. సికింద్రాబాద్ ‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొత్తం శోక శంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతిపై కిమ్స్‌ వైద్యులు ప్రకటన చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని తెలిపారు.

ఈ విషాద వార్తతో సినీ లోకం మూగబోయింది. 20 మే, 1955న ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లిలో జన్మించిన ఈయన .. కలం నుంచి ఎన్నో వేల పాటలు జాలువారాయి. సీతారామశాస్త్రి మరణవార్త విని సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని అనుకుంటుండగా.. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడం సిరివెన్నెల పాటలను ప్రేమించే కోట్లాది అభిమానులను క లిచివేస్తోంది.

కాగా ఆయన కలం నుంచి వచ్చిన పాట‌ల‌ను ఎంతో మంది గాయకులు అద్భుతంగా ఆలపించిన స్వరాలు మనం విన్నం. కానీ ఆయన రాసి… ఆయనే పాడిన పాటలు బోలెదు ఉన్నాయి. కాగా అందులో తొలి పాట ఏదో తెలుసా..? ఆ సినిమాప్రేఅయ్ క‌ళ్లు. ఈ సినిమాలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి “తెల్లారింది లెగండోయ్” అనే పాట పాడారు.

అప్పట్లో ఈ సినిమాకు సంగీత దర్శకుడు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరాలందించారు. ఈ సినిమాలో కీలక సమయంలో వచ్చే పాట కోసం సిరివెన్నె ల సాహిత్యాన్ని సిద్ధంగా ఉంచుకున్నారు . ఆ పాటను విన్న బాలసుబ్రమణ్యం.. ఈ పాట వేరే గాయకుడు పాడితే పాటకు సెట్ కాదని మీ గొంతు నుండి అయితే చాలా బాగా వస్తుందని చెప్పి పట్టు బట్టి..ఆయనే దగ్గార ఉండి
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి దగ్గర పాడించారట. ఇకా ఈ పాట అప్పట్లో ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ పాట ఒక్క ఊపు ఊపేసింది. ఇప్ప‌ట‌కీ చాలామంది మ‌దిలో ఈ పాట అలాగే నిలిచి పోయింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news