Movies"పుష్ప" ఐటమ్ సాంగ్ లో సమంత హాట్ అందాలు..లంగా జాకెట్‌ తో...

“పుష్ప” ఐటమ్ సాంగ్ లో సమంత హాట్ అందాలు..లంగా జాకెట్‌ తో మాస్ స్టెప్పులు..!!

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం “పుష్ప”. అల వైకుంఠపురం సినిమా తరువాత బన్నీ ఇటు సుక్కు కూడా రంగ‌స్థ‌లం లాంటి యునాన‌మ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని పుష్ప మీదే వ‌ర్క్ చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి సారిగా రష్మిక ఈ సినిమాలో డిగ్లామరస్ రోల్ లో నటించడం విశేషం.

రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ సినిమా తొలి భాగం డిసెంబర్‌ 17న క్రిస్ మస్ పండుగ కానుకగా విడుదల అవుతోంది. ఇక ఈ సినిమాకు సంబధించి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు చిర బృందం. ఇప్పటికే విడుదలైన ఫస్ లుక్స్..పాటలు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే రీసెంట్ గా ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉంటుందని అది కూడా ఫుల్ మాస్ బీట్ తో అద్దిరిపోతుందని.. ఇక ఆ పాటకు సమంత బన్నీ కలిసి డ్యాన్స్ చేయబోతున్నారని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

 

ఇక తాజాగా సమంత ఐటెం సాంగ్ కు సంబంధించి పుష్ప టీం క్రేజీ అప్ డేట్ ను ఇచ్చింది. సమంత పోస్టర్ రిలీజ్ చేస్తూ..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సమంత రూత్ ప్రభు కలసి చేస్తున్న రాకింగ్ నంబర్ ను భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. త్వరలో ఈ ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ ని చూడటానికి సిద్ధంగా ఉండండని పేర్కొన్నారు. ఇక ఈ పోస్టర్ లో సమంత లంగా జాకెట్‌ ధరించి, ఫుల్ మాస్‌ లుక్‌లో.. తన బ్యాక్‌ సైడ్‌ చూపిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘సిజ్లింగ్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా వస్తున్న ఈ పాటలో సమంత అదిరిపోయే స్టెప్పులేసినట్లు తెలుస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news