Moviesచై - సామ్ విడాకుల‌కు ముందు ఫ్యామిలీ మీటింగ్‌లో ఇంత జ‌రిగిందా...!

చై – సామ్ విడాకుల‌కు ముందు ఫ్యామిలీ మీటింగ్‌లో ఇంత జ‌రిగిందా…!

టాలీవుడ్ ను గత ఏడాది తీవ్ర కలవరపాటుకు గురి చేసిన అంశం నాగచైతన్య – సమంత విడాకులు. ఎన్నో ఏళ్ల పాటు కలిసి ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి అయ్యాక నాలుగేళ్ల పాటు కలిసి కాపురం చేసింది.
ఇప్పటికీ అభిమానులు వీరు ఇద్దరూ విడిపోవడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్నా ఈ జంట అసలు ఎందుకు ? విడిపోయారు.. అంతగా ప్రేమించుకున్న వీరిమధ్య విడిపోవడానికి బలమైన కారణం ఏంటి ? అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇక తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించిన సమంత – నాగ చైతన్య విడిపోవడానికి కారణాలు మాత్రం బయటకి చెప్పలేదు.

వీరిద్దరు విడిపోవడానికి ఎవరికివారు రకరకాలుగా ఊహించుకున్నారు. చాలామంది మాత్రం సమంత బిహేవియర్ వల్లే… ఆమెను ఎంతో ప్రేమించిన చైతు చివరకు వదులుకోవాల్సి వచ్చింది అని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది స‌మంత‌. ఆ వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్‌ సన్నివేశాల్లో నటించింది. సహజంగానే తెలుగు గడ్డపై మంచి సాంప్రదాయ కుటుంబంగా పేరున్న అక్కినేని కుటుంబానికి ఇది నచ్చలేదు.

అక్కినేని కుటుంబం అంటే తెలుగు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆ ఇంటి కోడలిగా ఉన్న సమంత ఇలా చేయటం వాళ్లకు ఏమాత్రం రుచించడం లేదు. ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తర్వాత అక్కినేని ఫ్యామిలీ ఒకసారి సమావేశం అయిందట. ఆ సమావేశంలోనే నాగార్జున – అమలతో పాటు ఇతర అక్కినేని ఫ్యామిలీ సభ్యులు అందరూ కూడా సమంతకు బోల్డ్ సన్నివేశాల్లో, స్పెషల్ సాంగ్స్ లో నటించడం మానుకోవాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. అయితే సమంత వారితో తీవ్రంగా విభేదించడంతో పాటు తనకు నచ్చినట్టుగా తాను ఉంటానని… తనకు నచ్చిన పాత్రలు చేస్తాన‌ని కరాఖండిగా తేల్చి చెప్పిందట.

ఆ సమావేశం అనంతరం చైతన్యతో విభేదించిన సమంత ఇంటి పేరులోని అక్కినేని అనే పదాన్ని తొలగించినట్టు తెలుస్తోంది. చివరకు ఈ వివాదం ముదిరి వారు విడాకులు తీసుకునే వరకు వెళ్లిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ వెబ్‌సైట్ బాలీవుడ్ లైఫ్‌ తాజాగా ప్రముఖంగా ప్రచురించడంతో వీరి విడాకుల విష‌యం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే తమ విడాకులపై చైతన్య – సమంత మౌనంగానే ఉంటున్న సమంత మాత్రం కొన్ని హింట్స్‌ ఇచ్చింది.

తాజాగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా ఎందుకు ? విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అన్న విషయంపై స్పందించారు. తాను అన్ని రకాల పాత్రలు చేస్తాను అని… అయితే తన కుటుంబానికి, తన కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించేలా తాను ఎన్నడూ వ్యవహరించ‌ను అని చెప్పారు. దీనిని బట్టి సమంత చేసిన బోల్డ్‌ పాత్రలే వారు విడిపోవటానికి కారణం అని స్పష్టంగా తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news