Moviesఅన్‌స్టాప‌బుల్‌... ఎవ్వ‌రూ ఊహించ‌ని వ్య‌క్తితో బాల‌య్య‌...!

అన్‌స్టాప‌బుల్‌… ఎవ్వ‌రూ ఊహించ‌ని వ్య‌క్తితో బాల‌య్య‌…!

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ మొదటి సారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాప‌బుల్‌. అల్లు అర‌వింద్‌కు చెందిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో వ‌స్తోన్న ఈ షో ఇప్ప‌టికే రెండు ఎపిసోడ్‌లు స్ట్రీమింగ్ చేసుకుంది. తొలి షోకు క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు త‌న వార‌సుడు మంచు విష్ణుతో పాటు కుమార్తె ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌తో క‌లిసి వ‌చ్చారు. ఇక రెండో షోకు నేచుర‌ల్ స్టార్ నాని వ‌చ్చారు. ఈ రెండు ఎపిసోడ్లు భారీ హిట్ అయ్యాయి.

ఇక మూడో వారం ఎపిసోడ్ షూట్ చేయ‌కుండానే బాల‌య్య బ్రేక్ తీసుకోవాల్సి వ‌చ్చింది. బాల‌య్య చేతికి చిన్న స‌ర్జ‌రీ జ‌ర‌గ‌డంతో బాల‌య్య ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక ఎంతో క్రేజ్ వ‌చ్చిన ఈ షోకు బ్రేక్ ప‌డ‌డంతో బాల‌య్య ఫ్యాన్స్ కూడా తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. మ‌ళ్లీ ఈ షో ఎప్పుడు ఉంటుందా ? అని ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో ఆహా షో నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ మూడో ఎపిసోడ్‌లో న‌వ్వుల రారాజు బ్ర‌హ్మానందం ఎంట్రీ ఇస్తున్నాడ‌ట‌. బాల‌య్య – బ్ర‌హ్మానందం కాంబోలో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి. ఇటీవ‌లే ఆలీ తో స‌ర‌దాగా షోలో కూడా బ్ర‌హ్మానందం వ‌చ్చాడు. ఈ ఎపిసోడ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇక ఇప్పుడు బాల‌య్య – బ్ర‌హ్మానందం క‌లిసి అన్‌స్టాపుబుల్ షోలో ఫుల్ ర‌చ్చ రంబోలా చేయ‌సేందుకు రెడీ అవుతున్నారు. మూడో ఎపిసోడ్‌లోనే వీరిద్ద‌రు క‌లిసి సంద‌డి చేయ‌బోతున్నార‌ట‌. గ‌త కొంత కాలంగా బ్ర‌హ్మానందం సినిమాలు ఎక్కువుగా చేయ‌డం లేదు. దీంతో తెలుగు సినీ జ‌నాలు బ్ర‌హ్మీ కామెడీని మిస్ అవుతున్నారు. మ‌రోసారి ఇప్పుడు బాల‌య్య‌తో క‌లిసి బ్ర‌హ్మీ కామెడీ చేయ‌నున్నాడు. మ‌రి ఈ ఎపిసోడ్ ఎన్ని సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అవుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news