Moviesర‌జ‌నీకాంత్‌కు పిచ్చ‌గా న‌చ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా ఇదే..!

ర‌జ‌నీకాంత్‌కు పిచ్చ‌గా న‌చ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా ఇదే..!

దివంగ‌త విశ్వవిఖ్యాత న‌టుడు ఎన్టీఆర్ పోలిక‌నే కాదు వార‌స‌త్వాన్ని కూడా అందిపుచ్చుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా రంగంలో తిరుగులేని స్టార్ హీరోగా కొన‌సాగుతున్నాడు. ఎన్టీఆర్ ఐదు వ‌రుస హిట్ల‌తో కెరీర్‌లోనే ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఎన్టీఆర్ సినిమాల‌కు ఇప్పుడు కేవ‌లం టాలీవుడ్‌లోనే కాదు టోట‌ల్ సౌత్ లో అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ న‌ట‌న అన్నా.. డ్యాన్స్ అన్నా కూడా తెలుగు సినిమా హీరోల‌తో పాటు కోలీవుడ్‌, శాండ‌ల్ వుడ్‌, మ‌ల్లూవుడ్‌, బాలీవుడ్ హీరోలు కూడా ఇష్ట‌ప‌డుతూ ఉంటారు.

ఈ క్ర‌మంలోనే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సైతం ఎన్టీఆర్ సినిమాల‌కు అభిమాని. ఎన్టీఆర్ న‌టించిన సినిమాలు ర‌జ‌నీ అప్పుడుప్పుడూ చూస్తూ ఉంటారు. ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా చూసిన ర‌జ‌నీ కాంత్ ఎన్టీఆర్ న‌ట‌న‌పై ప్ర‌త్యేకంగా ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ సినిమా చూశాక త‌న‌కు మొద‌టి సారి కొడుకులు లేనందుకు బాధ‌ప‌డుతున్నాన‌ని కామెంట్ చేశాడు.

ఈ సినిమా చూశాక త‌నకూ ఓ కొడుకు ఉంటే బాగుండేది క‌దా అన్న భావ‌న క‌లిగింద‌ని ర‌జ‌నీ చెప్పాడు. ఇక ర‌జ‌నీకి ఎన్టీఆర్ ఫ్యామిలీతో ముందు నుంచే ఎంతో అనుబంధం ఉంది. హ‌రికృష్ణ – ర‌జ‌నీకాంత్ ఎంతో స‌న్నిహితంగా ఉండేవారు. హ‌రికృష్ణ చ‌నిపోయిన‌ప్పుడు తాను జ‌పాన్‌లో ఉండ‌డం వ‌ల్లే రాలేక‌పోయాన‌ని ర‌జ‌నీ చెప్పారు. ఇక ర‌జ‌నీ తాజాగా న‌టించిన పెద్ద‌న్న సినిమా ఈ దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news