Moviesఎన్టీఆర్‌కే ట్విస్ట్ ఇచ్చిన థ‌మ‌న్‌, దేవిశ్రీ... క్లైమాక్స్‌తో షాక్ అయ్యారుగా...!

ఎన్టీఆర్‌కే ట్విస్ట్ ఇచ్చిన థ‌మ‌న్‌, దేవిశ్రీ… క్లైమాక్స్‌తో షాక్ అయ్యారుగా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీలో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు ప్రోగ్రామ్ వ‌స్తోంది. బిగ్‌బాస్ ఫ‌స్ట్ సీజ‌న్లో హోస్ట్‌గా సూప‌ర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ షో స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతూ జెమినీ టీవీని టీఆర్పీ రేటింగ్ ప‌రంగా ముందు నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఈ షోకు అప్పుడ‌ప్పుడు సెల‌బ్రిటీల‌ను తీసుకు వ‌స్తోన్న ఎన్టీఆర్ వారితో కూడా గేమ్ ఆడుతున్నారు. ఇప్ప‌టికే స‌మంత లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ షోకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే దీపావ‌ళి స్పెష‌ల్ ఎపిసోడ్‌గా టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ థ‌మ‌న్‌, దేవి శ్రీ ప్ర‌సాద్ వ‌చ్చారు. ఈ ముగ్గురి షో అదిరిపోయే ఎంట‌ర్టైన్‌మెంట్ ప్రేక్ష‌కుల‌కు ఇచ్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఎపిసోడ్ లేన‌ట్టుగా మూడు గంట‌ల పాటు ఈ షో సాగింది. ఈ ఎపిసోడ్‌లో కూడా కొన్ని ఫ‌న్నీ మూమెంట్స్ ఉన్నాయి. ఓ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ కోసం థ‌మ‌న్‌- దేవిశ్రీ వీడియో కాల్ ఆప్ష‌న్ తీసుకున్నారు. ఆ ఆప్ష‌న్‌లో త‌మకు ఎదురుగా ఉన్న నెంబ‌ర్ల‌లో ఎన్టీఆర్ నెంబ‌ర్ కూడా క‌నిపిస్తుంది. కంప్యూట‌ర్‌ను ఎన్టీఆర్‌కు కాల్ క‌నెక్ట్ చేయ‌మంటే ఎన్టీఆర్ ఫోన్ స్విచ్ఛాప్ వ‌చ్చింది.

ఈ ఫ‌న్నీ సంఘ‌ట‌న ప్రేక్ష‌కుల‌కు న‌వ్వులు పూయించింది. ఓవ‌రాల్ గా ఈ ఎపిసోడ్ ప్రేక్ష‌కుల‌కు మంచి ఎంట‌ర్టైన్‌మెంట్ ఇచ్చింది. ఇక థ‌మ‌న్‌, దేవిశ్రీ ఇద్ద‌రూ కూడా ఇప్పుడు వ‌రుస పెట్టి టాప్ హీరోల సినిమాల‌కు మ్యూజిక్ ఇస్తూ దూసుకు పోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news