Moviesఈ ముదురు హీరోయిన్ల‌కు ఇప్ప‌ట్లో పెళ్లి అయ్యేలా లేదే...!

ఈ ముదురు హీరోయిన్ల‌కు ఇప్ప‌ట్లో పెళ్లి అయ్యేలా లేదే…!

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల‌కు కెరీర్ త‌క్కువ ఉంటుంది. వారికి మ‌హా అయితే ఐదారేళ్లు మాత్ర‌మే ఇక్క‌డ ఫ్యూచ‌ర్ ఉంటుంది. అయితే న‌య‌న‌తార‌, అనుష్క లాంటి కొద్ది మంది హీరోయిన్లు మాత్ర‌మే ప‌ది నుంచి ప‌దిహేను సంవ‌త్స‌రాల పాటు లాంగ్ కెరీర్ కంటిన్యూ చేస్తూ వ‌స్తుంటారు. ఇది వాళ్ల అదృష్టంగానే చెప్పాలి. ఈ త‌రంలో హీరోయిన్లు కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు పెళ్లి చేసుకుంటే వారికి అవ‌కాశాలు త‌గ్గిపోతూ ఉంటాయి. అందుకే ఛాన్సులు వస్తున్నాయ‌నే అనుష్క‌, న‌య‌న‌తార ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు.

అయితే కొంద‌రు హీరోయిన్లు మాత్రం ముదురు వ‌య‌స్సు దాటుతున్నా కూడా ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు. వారు ఇంకా ఛాన్సుల కోస‌మే లేదా సెకండ్ ఇన్సింగ్స్‌లో మ‌రిన్ని ఛాన్సులు వ‌స్తాయి.. మ‌ళ్లీ ఓ వెలుగు వెల‌గ‌వ‌చ్చ‌నో పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండి పోతున్నారు. అస‌లు వీరి వ‌య‌స్సు చూస్తే ఇప్ప‌ట్లో వారికి పెళ్లి అవుతుందా ? అన్న డౌట్లు కూడా క‌లుగుతున్నాయి. ఆ హీరోయిన్ల లిస్ట్ ఏంటో ఓ సారి చూద్దాం.

1- శోభ‌న‌:
సీనియ‌ర్ న‌టి శోభ‌న వ‌య‌స్సు ఇప్ప‌టికే 51 సంవ‌త్స‌రాలు. అయినా ఆమె ఇప్పట‌కీ పెళ్లి చేసుకోలేదు. ఆమెకు పెళ్లి చేసుకునే ఆలోచ‌న కూడా లేదు. ఓ బాబును మాత్రం ద‌త్త‌త తీసుకుని పెంచుకుంటోంది. ఆమె పిల్ల‌ల‌కు నాట్యంలో శిక్ష‌ణ ఇస్తూ జీవితం కొన‌సాగిస్తోంది.

 

2- దివ్య ద‌త్త‌:
బాలీవుడ్‌లో ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన దివ్య ద‌త్త వ‌య‌స్సు 43. అయితే ఇప్ప‌ట‌కీ ఆమె పెళ్లి అన్న పేరు ఎత్తితేనే నో చెప్పేస్తోంది. త‌న అభిప్రాయాల‌కు, అభిరుచుల‌కు స‌రైన వ్య‌క్తి ఇప్ప‌టి వ‌ర‌కు తన‌కు తార‌స‌ప‌డ‌లేద‌ని.. అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాన‌ని చెపుతోంది.

3- అమీషా పటేల్ :
హృతిక్ రోష‌న్ క‌హోనా ప్యార్ హై, ప‌వ‌న్ క‌ళ్యాణ్ బద్రి సినిమాల‌తో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యింది. ఆమె వ‌య‌స్సు ఇప్ప‌టికే 46 ఏళ్లు. అయినా హాట్ హాట్ ఫొటోల‌తో ఈ వ‌య‌స్సులో కూడా రెచ్చిపోతూ ఉంటోంది. ఇప్ప‌ట‌కీ ఆమె పెళ్లి అన్న మాటే ఎత్త‌డం లేదు.

4- న‌గ్మా:
ఒక‌ప్పుడు కుర్ర కారును త‌న అంద‌చందాల‌తు, హోమ‌ల‌తో ఓ ఊపు ఊపేసింది నగ్మా. అప్ప‌ట్లో ఎంతో మంది హీరోల‌తో ఆమె ఎఫైర్లు పెట్టుకుంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. మ‌ధ్య‌లో ఆమె భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ సార‌వ్ గంగూలీతో కూడా ప్రేమ‌లో ప‌డింది. ఆ త‌ర్వాత వీరు విడిపోయారు. 46 ఏళ్లు దాటుతున్నా న‌గ్మా ఇప్ప‌ట‌కీ పెళ్లికి దూరంగానే ఉంది.

5- సుస్మితా సేన్ :
మాజీ మిస్ ఇండియా సుస్మితాసేన్ వయసు ప్రస్తుతం 50 సంవత్సరాలు. ఆమె ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ద‌త్త త తీసుకుంది. అయితే ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో ఉంది. అత‌డు కూడా ఆమె కంటే వ‌య‌స్సులో చాలా చిన్న‌వాడు. అయితే ఇప్ప‌ట‌కీ ఆమె పెళ్లి అన్న మాట ఎత్త‌డం లేదు.

6- టబు : ట‌బు వ‌య‌స్సు 50 దాటేసింది. అయితే ఇప్ప‌ట‌కీ ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటోంది. త‌న మ‌న‌స్సుకు న‌చ్చిన‌వాడు దొర‌కుండా పెళ్లి చేసుకుని అత‌డిలో క‌లిసి ఉండ‌డం కంటే అంత‌కు మించిన దౌర్భాగ్యం మ‌రొక‌టి ఉండ‌ద‌ని ఆమె చెపుతుంది.

వీరితో పాటు అనుష్క 40 ఏళ్లు క్రాస్ చేసినా ఇప్ప‌ట‌కి పెళ్లి చేసుకోలేదు. ఇక న‌య‌న‌తార కూడా ప్రియుడితో క‌లిసి అదిగో పెళ్లి ఇదిగో పెళ్లి అన‌డ‌మే త‌ప్పా పెళ్లి చేసుకోవ‌డం లేదు. మ‌రి ఈ ఆంటీ హీరోయిన్లు ఎప్ప‌ట‌కి పెళ్లీ చేసుకుంటారో ? ఎప్పుడు ఓ మ‌గ‌తోడుతో క‌లిసి సంసార జీవితం ప్రారంభిస్తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news