Moviesప్లాప్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన సినిమాలివే..!

ప్లాప్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన సినిమాలివే..!

ప్లాప్ టాక్ వ‌చ్చినా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొన్ని సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతాయి. అలాగే ముందు హిట్ టాక్‌తో స్టార్ట్ అయిన సినిమాలు కూడా చివ‌ర‌కు న‌ష్టాన‌లు మిగుల్చుతాయి. తెలుగులో కొన్ని సినిమాలు మ‌రీ ఘోర‌మైన ప్లాప్ టాక్‌తో స్టార్ట్ అయ్యి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కత్వంలో అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన స‌రైనోడు సినిమాకు ముందు నెగిటివ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత మెల్ల‌గా పుంజుకుని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము రేపేసింది. బ్యాడ్ టాక్‌తో స్టార్ట్ అయ్యి రు. 70 కోట్ల షేర్ సాధించింది. ఇటీవ‌లే శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా చేసిన పెళ్లిసంద‌D సినిమా తొలి రోజే డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఊహించ‌ని విధంగా భారీ క‌లెక్ష‌న్లు సాధించి సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

పూరి జ‌గ‌న్నాథ్ – రామ్ కాంబోలో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా కూడా ముందు నెగిటివ్ టాక్ తెచ్చుకుని త‌ర్వాత భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమాకు కూడా ముందు ప్లాప్ టాక్ వ‌చ్చింది. త‌ర్వాత ఆ సినిమా హిట్ కొట్టేసింది. అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి కూడా ముందు నెగిటివ్ టాక్‌తో స్టార్ట్ అయ్యి త‌ర్వాత సూప‌ర్ హిట్ అయ్యింది.

ర‌వితేజ ప‌వ‌ర్‌, నాగార్జున ద్విపాత్రాభిన‌యం చేసిన సోగ్గాడే చిన్ని నాయ‌నా, నాని ఎంసీఏ, గోపీచంద్ శౌర్యంతో పాటు రామ్‌చ‌ర‌ణ్ ర‌చ్చ‌, వెంక‌టేష్ తుల‌సీ, ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలు ముందు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఆ త‌ర్వాత ఈ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ హిట్ కొట్టాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news