Moviesవిడాకుల‌పై పూన‌మ్ సంచ‌ల‌న ట్వీట్‌... అంత‌లోనే ట్విస్ట్‌...!

విడాకుల‌పై పూన‌మ్ సంచ‌ల‌న ట్వీట్‌… అంత‌లోనే ట్విస్ట్‌…!

పూన‌మ్ కౌర్ తెలుగులో ఆమె చేసిన సినిమాలు త‌క్కువే.. ఆమెకు వ‌చ్చిన హిట్లు కూడా త‌క్కువే. అయితే ఓ స్టార్ హీరోయిన్‌కు కూడా రాని పేరు ఆమెకు వ‌చ్చింది. పూన‌మ్ చుట్టూ తెలుగులోనే అనేక బిగ్ కాంట్ర‌వ‌ర్సీలు చేరాయి. ఆమెకు ఓ స్టార్ హీరోతో ఎఫైర్ ఉంద‌న్న ప్ర‌చారం.. ఆ స్టార్ హీరోను ఆమె పెళ్లి చేసుకునే వ‌ర‌కు వ్య‌వ‌హారం వెళ్లింద‌ని.. అంత‌లోనే మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ ఎంట్రీ ఇచ్చి ఆమెను ఆ స్టార్ హీరోకు దూరం చేశాడ‌న్న‌ది రెండేళ్ల నుంచి ఇండ‌స్ట్రీలో వినిపిస్తోందే..!

ఆమె సోష‌ల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ఆ స్టార్ హీరోను టార్గెట్‌గా చేసుకుని చాలా పోస్టులే పెడుతూ ఉంటోంది. ఇక శ్రీరెడ్డి కూడా ప‌వ‌న్ ఇష్యూలో పూన‌మ్ కౌర్‌ను బ‌య‌ట‌కు లాగి చేయాల్సిన ర‌చ్చ చేసింది. ఇలా పూన‌మ్ సినిమాల కంటే కూడా కాంట్ర‌వ‌ర్సీల‌తోనే ఎక్కువుగా వార్త‌ల్లో ఉన్నారు. ఆమె చివ‌ర‌గా శ్రీనివాస క‌ళ్యాణం సినిమాలో చిన్న పాత్ర మాత్ర‌మే చేసింది. తాజాగా ఆమె విడాకుల‌పై చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

విడాకుల గురించి పూన‌మ్ స్పందిస్తూ విడాకుల త‌ర్వాత మ‌గ‌వారికి బాధ ఉండ‌దా ? ఎక్కువ మంది ఆడ‌వాళ్లే ఇబ్బందులు పెడుతూ ఉంటారు ? ఆడ‌వాళ్లే వారిని మాట‌ల‌తో బాధ పెడ‌తారు ? వారి వ‌ల్లే మ‌గ‌వారికి ఈ క‌ఠిన ప‌రిస్థితులు వ‌స్తుంటాయ‌ని ? అస‌లు ఈ స‌మాజం ప‌క్ష‌పాతంతో ఉంటోందా ? అస‌లు విడాకుల విష‌యాన్ని మ‌నం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగ‌లికే స్థితిలో ఉన్నామా ? అని పేర్కొంది. అయితే కొద్ది సేప‌టికే ఈ ట్వీట్‌ను ఆమె డిలీట్ చేసింది.

అయితే పూన‌మ్ ఈ ట్వీట్ ఎవ‌రిని ఉద్దేశించి చేసింది అన్న దానిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించు కుంటున్నారు. ఇటీవ‌ల టాలీవుడ్లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను టార్గెట్‌గా చేసుకునే ఆమె ఈ పోస్ట్ చేసిందా అని కొంద‌రు చర్చిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news