Moviesఅనుష్క పేరు మార్చ‌డానికి రీజ‌న్ తెలుసా....!

అనుష్క పేరు మార్చ‌డానికి రీజ‌న్ తెలుసా….!

అనుష్క శెట్టి ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఈ పేరుకు గ‌త ప‌దిహేనేళ్లుగా ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. 2005 సూప‌ర్ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన అనుష్క వ‌రుస హిట్ల‌తో సౌత్ సినిమాను దున్నేసింది. తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డంతో పాటు మ‌ళ‌యాళంలోనూ ఆమె ఎన్నో హిట్ సినిమాలు చేసింది. తెలుగులో అయితే చిరంజీవి, బాల‌య్య‌, నాగార్జున, వెంక‌టేష్ లాంటి సీనియ‌ర్ హీరోల‌తో పాటు మ‌హేష్‌బాబు లాంటి యంగ్ హీరోల స‌ర‌స‌న కూడా సినిమాలు చేసింది.

ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాల‌కు ఆమె ఇప్పుడు కేరాఫ్ అడ్ర‌స్ అయిపోయారు. అరుంధ‌తితో ఆమె సౌత్ ఇండియాలో జేజ‌మ్మ అయిపోయారు. అయితే అనుష్క వ‌య‌స్సు నాలుగు ప‌దుల‌కు చేరువ అవుతున్నా ఆమె ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు. ఇక ఆమె ఫ్యామిలీ గురించి కూడా చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. ఆమె క‌ర్నాట‌క‌లోని మంగుళూరులో పుట్టింది. ఆమె ఇండస్ట్రీలోకి రాక‌ముందు యోగా టీచ‌ర్‌.

ఆమె అస‌లు పేరు స్వీటి శెట్టి అట‌. ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. అయితే ఆమె అడ్మిష‌న్‌లో చేరేట‌ప్పుడు స్విటీ అని రాస్తే ముద్దు పేరులా ఉంటుంది.. అస‌లు పేరు చెప్ప‌మ‌ని అడిగార‌ట‌. దీంతో అప్పుడు త‌న మ‌న‌సులో అనుష్క అనే పేరు గుర్తుకు రావ‌డంతో ఆమె అనుష్క అని చెప్పింద‌ట‌. అలా ఆమె పేరు అనుష్క‌గా మారిపోయింది.

ఆమె స్టార్ హీరోయిన్ అయ్యాక‌.. అనుష్క జాత‌కంలో దోషం ఉందని.. అందుకే ఆమె పేరు మార్చార‌ని ప్ర‌చారం చేశారు. ఈ ప్ర‌చారాన్ని అనుష్క ఖండించింది. ఇక అనుష్క‌కు వ‌య‌స్సు ముదిరిపోతూ ఉండ‌డంతో పెళ్లి చేసేందుకు ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తున్నార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news