Moviesరాజ‌మౌళిపై మోహ‌న్‌బాబు కోపానికి ఆ కోరిక రిజెక్ట్ చేయ‌డ‌మే కార‌ణ‌మా...!

రాజ‌మౌళిపై మోహ‌న్‌బాబు కోపానికి ఆ కోరిక రిజెక్ట్ చేయ‌డ‌మే కార‌ణ‌మా…!

టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పేరు చెబితే చాలామంది భయపడుతుంటారు. సీనియర్ హీరో మోహన్ బాబు ఎవరి విషయంలో ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తూ ఉంటారు. ఎవరి గురించి అయినా మోహన్ బాబు నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన చాలా మందికి శత్రువు కూడా అయ్యారు. అందుకే మోహన్ బాబు గురువు అయిన దర్శకుడు దాసరి నారాయణరావు మోహన్ బాబుకు అస్స‌లు లౌక్యం తెలియ‌దు అని ఎన్నోసార్లు చెప్పారు.

ఇక మోహన్ బాబుకు.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఎన్నో సార్లు గొడవలు జరగడం… తర్వాత వారు సఖ్యతతో సర్దుకుపోవడం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి కూడా గతంలో ఓ విషయంలో చిన్న‌పాటి గ్యాప్‌ తలెత్తిన ప్రచారం అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. మోహన్ బాబు కుమారులు ఇద్దరు హీరోలుగా ఉన్నా కూడా స్టార్ హీరోలు కాలేకపోయారు.

ఇప్పటికీ విష్ణు, మనోజ్ హీరోలుగా నిలదొక్కుకునేందుకు కష్టాలు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే విష్ణు హీరోగా ఒక సినిమా చేసి పెట్టాలని.. తానే నిర్మాతగా ఉంటానని మోహన్‌బాబు రాజమౌళిని కోరారట. రాజమౌళి దర్శకత్వంలో మంచు విష్ణుకు ఒక హిట్ సినిమా వస్తే విష్ణు కెరీర్ మరోలా ఉంటుందని మోహన్ బాబు భావించారు.

అయితే అప్పుడు విష్ణువు తగిన కథ‌ తన వద్ద లేదని… టైం వచ్చినప్పుడు తాను కచ్చితంగా విష్ణుతో ఓ సినిమా తీస్తానని రాజమౌళి మోహన్‌బాబు కోరికను రిజెక్ట్ చేశారట. అయితే మోహన్ బాబు తాను ఇండస్ట్రీలో ఎవరిని ఏమడిగినా కాదన‌ర‌ని… రాజమౌళి మాత్రం తన కోరిక తీర్చలేదని కాస్త ఫీలయ్యార‌ట‌. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ సినిమాలో మోహన్ బాబు యమ ధర్మరాజు పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news