Moviesస్టూడెంట్ నెంబ‌ర్ సినిమాకు ఎన్టీఆర్‌ను హీరోగా రాజ‌మౌళి ఎందుకు ఇష్ట‌ప‌డ‌లేదు...!

స్టూడెంట్ నెంబ‌ర్ సినిమాకు ఎన్టీఆర్‌ను హీరోగా రాజ‌మౌళి ఎందుకు ఇష్ట‌ప‌డ‌లేదు…!

తెలుగు సినిమా రంగంలో తిరుగులేని వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శక ధీరుడు రాజమౌళి – టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ కు ఉన్న క్రేజే వేరు. రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేష‌న్లో నాలుగు సినిమాలు వ‌చ్చాయి. రాజమౌళి కెరీర్‌ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతోనే..! వీరిద్దరి కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ వన్ – సింహాద్రి – యమదొంగ సినిమాలతో పాటు తాజాగా ఆర్ ఆర్ ఆర్‌ సినిమా వస్తోంది.

ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ అంటే బ్లాక్ బ‌స్టర్ కాంబినేషన్ అన్న పేరు ఉంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దగ్గర పలు సీరియల్స్ కు రాజమౌళి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఈ క్రమంలోనే ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రాజమౌళిని దర్శకుడిగా పరిచయం చేస్తూ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తెరకెక్కించారు. త‌న‌కు ద‌ర్శ‌క‌త్వం ఛాన్స్ రావ‌డంతో రాజ‌మౌళి ముందు ఎగిరి గంతేశార‌ట‌. ఆ సినిమాలో ఎన్టీఆర్ హీరో అని తెలియ‌డంతో ఒక్క‌సారిగా రాజ‌మౌళికి నీర‌సం వ‌చ్చింద‌ట‌.

అయితే ఆ సినిమా షూటింగ్ కు ముందు ఎన్టీఆర్ ను చూసిన రాజమౌళి తనకు రాక రాక దర్శకత్వం ఛాన్స్ వచ్చిందని… తన మొద‌టి సినిమాకు ఇలాంటి హీరో దొరికాడు ఏంటా ? అని ఫీల్ అయ్యారట. అప్పటికే ఎన్టీఆర్ స్టిల్స్ చూసిన రాజమౌళి ఎన్టీఆర్ బొద్దుగా, లావుగా ఉండటంతో తన సినిమాకు ఎంత వరకు సూట్ అవుతాడు అని కాస్త టెన్షన్ పడ్డాడట‌.

అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి నాలుగైదు సీన్లు చేసిన వెంటనే ఎన్టీఆర్లో అమోఘమైన నటన ఉందన్న విషయాన్ని రాజమౌళి గుర్తించారట. అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ లో ఉన్న అన్ని న‌ట‌ రసాలను తెరపై ఆవిష్కరించడం కుదర్లేదు. అందుకే త‌న రెండో సినిమాలోనూ ఎన్టీఆర్ హీరోగా పెట్టుకుని సింహాద్రి లాంటి యాక్షన్ సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news