Moviesనటి ప్రగతి కూతురు ఒక స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.?

నటి ప్రగతి కూతురు ఒక స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటీమణి గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రగతి. ఇకపోతే కరోనా వచ్చినప్పటి నుంచి ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది అని చెప్పాలి.. ఎందుకంటే ఖాళీ సమయంలో ఏం చేయాలో తెలియక జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ , రకరకాల దుస్తులతో సారీ లతో అందాలను ఒలకబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఆ వీడియోలను , ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఈమెకు అభిమానులు కూడా బాగానే పెరిగారని చెప్పాలి. అంతేకాదు తీన్మార్ స్టెప్పులతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ కూడా అవుతోంది ప్రగతి.

ఇకపోతే తాజాగా కొన్ని సినిమాలలో ప్రగతి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఎఫ్ 3 సినిమాలో కూతురు కాస్తా నిజజీవితంలోనూ తన కూతురు అయింది అంటూ, మెహరీన్ ను తన బిడ్డగా భావిస్తున్నట్లు తెలిసింది ప్రగతి. ఇప్పటికే ఎఫ్ టు చిత్రంలో ప్రగతి, మెహరిన్ లు తల్లి కూతురు గా నటించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరోసారి ఎఫ్ త్రి సినిమాలో కూడా తల్లీకూతుళ్లు గా నటిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య బాండ్ అలా కొనసాగుతోంది అట. అందుకే మెహరీన్ తన కూతురు లాంటిది అని తెలిపింది ప్రగతి. అంతేకాదు ఈమెకు హీరోయిన్ రెజీనా తో కూడా మంచి అనుబంధం ఉందని ఈ విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.

రెజీనా కూడా తన కూతురు లాంటిదని , తనను అమ్మ అని పిలుస్తుంది అని తెలిపింది.. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా నుంచి రేజీనాకు, తనకు మంచి బాండింగ్ ఏర్పడింది అని కూడా ప్రగతి తెలిపింది. ఇక మెహరీన్, రెజీనా మాత్రమే కాదు ఇలియానాకి కూడా ప్రగతితో మంచి అనుబంధం ఉందట.. పవన్ కళ్యాణ్ జల్సా చిత్రం నుంచి వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండడంతోపాటు బెస్ట్ ఫ్రెండ్స్ లా కూడా మారిపోయారు అట. అంతేకాదు షూటింగ్ సమయంలో ఇలియానాకు హెయిర్ డ్రెస్సర్ రాకపోతే ప్రగతి దగ్గరుండి రెండు జడలు కూడా వేసిందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news