Moviesబిగ్ సర్ ప్రైజ్: ఒక్కే వేదిక పై మెరవనున్న బాలయ్య-బన్నీ..!!

బిగ్ సర్ ప్రైజ్: ఒక్కే వేదిక పై మెరవనున్న బాలయ్య-బన్నీ..!!

హా..ఇది నిజంగా అభిమానులకు ఓ బిగ్ బిగ్ సర్ ప్రైజ్ లానే ఉంది. నిజం చెప్పాలి అంటే అభిమానులకి పండగ లాంటిదే. లేకపోతే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్,నందమూరి నట సిం హం బాలకృష్ణ ఒక్కే స్క్రీన్ లో చూడడం అంటే మాటాలా..కాదు అధి ఓ అద్భుతం. అదే జరగబోతుంది. బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ” అఖండ”. ఈ సినిమా లోనందమూరి బాలకృష్ణ పక్కన ప్రగ్యా జైస్వాల్‌హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నాడు.

ఈ సినిమా డిసెంబరు 2న గ్రాంఘ్ గా రిలీజ్ అవుతుంది. దీంతో ఈ నెల 27న నిర్వహించే అఖండ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించడానికి రెడీ అయ్యారు. అంతేకాదు ఈ సినిమాకి పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అంతేకాదు ఈ అఖండ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కి ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారట. హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వార్త అటు మెగా అభిమానుల్లోను ఇటు నందమూరి అభిమానుల్లోను మంచి జోష్ నింపుతుంది.

బన్నీ- బాలయ్య ఒకే వేదికపై సందడి చేయనుండటంతో ఫ్యాన్స్‌కి ఇక పండుగే అని చెప్పొచ్చు. బాలకృష్ణతో అల్లు అర్జున్‌కు మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలీసందే. ఈ మధ్యే ఆహాలో అన్ స్టాపబుల్ విత్ ణ్భ్ఖ్ షోను ప్రారంభించారు. ఆ టాక్ షోలో బాలయ్య అదరగొట్టేస్తున్న సంగతి తెలిసిందే. అలా అల్లు నందమూరి బంధం మరోసారి తెర మీదకు వచ్చింది. ఇక మరో వైపు బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. బోయపాటి బన్నీ కాంబినేషన్‌లో మరో సినిమా కూడా రాబోతోన్నట్టు అల్లు అరవింద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా అల్లు అర్జున్ – బాలయ్య ఒక్కే వెదిక పై కనిపించనున్నారు అంటేనే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news