Moviesఆయన వల్ల కోట్లు పోగొట్టుకున్న నాగార్జున..ఇంత మోసమా..?

ఆయన వల్ల కోట్లు పోగొట్టుకున్న నాగార్జున..ఇంత మోసమా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ కి ఉన్న కేజ్ గురించి చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ బడా ఫ్యామిలీలో అక్కినేని కుటుంబం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాపులారిటీ తెచ్చుకున్న ఫ్యామిలీ. వీరి కుటుంబం నుంచి వచ్చిన వారసులు కూడా తమ కంటూ ఓ స్పేషల్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నారు. మొదట అక్కినేని నాగేశ్వర రావు..ఆ తరువాత నాగార్జున..ఆ తరువాత నాగాచైతన్య,అఖిల్ ఇలా అందరు మంచి పేరు తెచ్చున్నారు. ఇక అక్కినేని నాగార్జున గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున నవమన్మధుడుగా 60 సంవత్సరాలు దాటినా అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక నాగార్జున కి ఎన్నో బిజినెస్ లు ఉన్న విషయం తెలిసిందే. కోట్ల ఆస్తి కూడా ఉంది. అంతకు మించి మంచి తెలివితేటలు కూడా ఉన్నాయి. కానీ ఏం లాభం ఒక బ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయాదట నాగార్జున. సాధారణంగా సినీ ఇండస్ట్రీ లో ఉండే నటులు మోస పోవడం చాలా కామన్. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు మోసపోయారు. కానీ సినీ ఇండస్ట్రీలో ఓక్క పెద్ద మనిషి అయ్యి ఉండి మంచి తెలివితేటలు ఉండి కూడా నాగార్జున మొసపోయాడంటే పరిస్ధితిలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

నాగార్జున దగ్గర బంధువు అయిన ఓ వ్యక్తి ఆయనను నమ్మించి మోసం చేయడంతో ఏకంగా కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారట . ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ద్వారా నాగార్జున గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సమీప ప్రాంతంలో ఒక భూమిని కొనుగోలు చేశారట. కానీ ఆ భూమి విష‌యంలో కొన్ని అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని.. దాంతో నాగార్జున కోట్ల రూపాయిల‌ను న‌ష్ట‌పోయాడ‌ని గ‌తంలో పెద్ద ఎత్తున క‌థ‌నాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి మొసాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మరి చూడాలి వీటికి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news