Moviesబాలయ్య అన్‌స్టాప‌బుల్ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎన్ని గంటలకు అంటే..పూర్తి డీటైల్స్..!!

బాలయ్య అన్‌స్టాప‌బుల్ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎన్ని గంటలకు అంటే..పూర్తి డీటైల్స్..!!

ఆహా..సరికొత్త కంటెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ . రకరకాల వెబ్ సిరీస్ లతో కొత్తకొత్త సినిమాలతో.. ఆకట్టుకునే టాక్ షోలతో అలరిస్తుంది ఆహా. ఇప్పటికే ఆహా వేదికగా అనేక సినిమాలు సిరీస్ లు,సినిమాలు,తాక్ షోలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే బాలయ్య తో మరో టాక్ షో రాబోతుంది. అన్‌స్టాప‌బుల్ విత్ ణ్భ్ఖ్ పేరుతో రాబోతున్న ఈ షోలో బాలయ్య హోస్ట్‏గా వ్యవహరించనున్నారు.

టాలివుడ్ లో విలక్షణ నటుడిగా, అభిరుచి గల నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కలెక్షన్ కింగ్.. డా.మంచు మోహన్ బాబు ఈ షో లో ఫస్ట్ గెస్ట్‌గా రాబోతున్నారు. ఆయనతో పాటు కుమార్తె మంచు లక్ష్మీ, పెద్ద కుమారుడు, ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా పాల్గొన్నారు. అందరూ అనుకున్నట్లు ఉంటే అది ‘అన్‌స్టాపబుల్’ ఎందుకవుతుంది?.. ఊహించిన దానికంటే మరింత రసవత్తరంగా ఉందీ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో. ఇక ఇప్పటికే విడుదలైన ప్రోమో.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

సరే ఈ షో నవంబర్ 4వతేది వస్తుందని తెలుసు కానీ ఆహాలో ఎప్పుడు స్ట్రీం అవుతుందో తెలియక బలయ్య అభిమానులు సతమతం అవుతున్న వేళ..ఆహా అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చింది. తాజాగా అన్‌స్టాప‌బుల్ విత్ ణ్భ్ఖ్ మొదటి ఎపిసోడ్ రేపు (నవంబర్ 4న) ఉదయం 11.20 నిమిషాలకు స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దీపావళిగా కానుకగా ఈసారి సరికొత్తగా ప్రేక్షకులను అలరించనున్నారు బాలయ్య.ఇక ఈ నందమూరి నటసింహం మంచు ఫ్యామిలీతో చేసే సరదా అల్లరిని మనం ఇంకాసేప్పట్లో ఆహాలో చూసేయ్యోచ్చు.. మరి ఎందుకు ఆలస్యం మీరు రెడీగా ఉండండి..!!

Asalaina Entertainment Repatinundi Shuru 🤙#UnstoppableWithNBK Episode 1 with Manchu Family Premieres tomorrow at 11:20 AM 💥💥#NandamuriBalakrishna @themohanbabu @iVishnuManchu @LakshmiManchu #MansionHouse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustries pic.twitter.com/3yEpcbdS7h

— ahavideoIN (@ahavideoIN) November 3, 2021

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news