Moviesప్రియాంక ట్రాన్స్‌జెండ‌ర్‌గా మార‌డానికి కారణం.. ఆ ఒక్క రూపాయే..!!

ప్రియాంక ట్రాన్స్‌జెండ‌ర్‌గా మార‌డానికి కారణం.. ఆ ఒక్క రూపాయే..!!

ప్రియాంక..ఈ పేరు ఒక్కప్పుడు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు కోట్లది ప్రజల మంది ఆమె పేరును పలుకుతున్నారు. అందుకు కారణం బిగ్ బాస్. తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్‌లో ఒక్కరికిగా హౌస్ లోఖి వెళ్లిన ప్రియాంక.. బాగా సెటిల్డ్‌గా ఆడుతూ.. ప్రేక్షక ఆదరణతో మంచి మెజారిటీతో దూసుకుని పోతుంది.

ఇక జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ దక్కించుకున్న ప్రియాంక అలియాస్ సాయి తేజ తాను ట్రాన్స్ జెండర్‌గా మారడానికి ఎన్ని ఇబ్బందులు పడిందో.. ఎలాంటి అవమానాలు ఎదుర్కొందో తెలియజేస్తూ బిగ్ బాస్ హౌస్‌లో ఎమోషనల్ అయ్యింది. అయితే సాయి తేజ నుంచి ప్రియాంక (పింకీ)గా మారాడానికి ఆమె ఆలోచిస్తున్న సమయంలో ఆమె హైదరబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లి.. అక్కడ అమ్మవారు ఇచ్చిన నిర్ణయాన్ని బట్టే తాను ఫైనల్ డెసిషన్ తీసుకుంటానని ఫిక్స్ అయ్యిందట.

ఇక చాలా మందికి తెలిసిన విషయమే పెద్దమ్మ తల్లి గుడిలో మనసులో కోరిక అనుకుని రూపాయి కాయిన్‌ని నిలబెట్టి .. ఆ కాయిన్ పడిపోతే ఆ కోరిక నెరవేరదని.. ఒకవేళ కాయిన్ నిలబడే ఉంటే తప్పకుండా కోరిక నెరవేరుతుందని బలంగా నమ్ముతుంటారు భక్తులు. ఇలాగే తన మనసులోని కోరికను కోరుకుని కాయిన్ ను నిలబెట్టింది ప్రియాంక. ఆ రూపాయి కాయిన్ పడిపోకుండా నిలబడే ఉండటంతో అమ్మవారి అనుగ్రహం లభించింది అనుకుని ..వెంటనే ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకుని.. ట్రాన్స్ జెండర్‌గా మారిపోయింది. ఇక అలా సాయి తేజ నుంచి ప్రియాంక (పింకీ)గా చెమారిపోయానని చెప్పుకొచ్చింది ప్రియాంక.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news