Moviesబిగ్ క్రేజీ అప్డేట్: స్టైలీష్ హీరోతో జోడి కట్టనున్న సమంత..?

బిగ్ క్రేజీ అప్డేట్: స్టైలీష్ హీరోతో జోడి కట్టనున్న సమంత..?

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో బన్నీ పాన్ ఇండియా స్టార్‏గా మారేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అనుకున్నట్టుగానే పుష్ప సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ అన్ని పాన్ ఇండియా సినిమాలనే చేయాలని భావిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

అయితే “పుష్ప” రెండవ పార్ట్ తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాలో నటించనున్నాడు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు బోయపాటి శ్రీను ఎప్పటినుంచో బన్నీతో సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం బట్టి ఈ విషయమై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తుంది.ఇక అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో బన్నీకి మరింత మాస్ ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్ బన్నీ, బోయపాటి కాంబో రిపీట్ అవుతుందని తెలియగానే టాలీవుడ్ లో మంచి బజ్ ఏర్పడింది. అంతేకాదు ఈ సినిమా లో సమంత ని హీరోయిన్ గా తీసుకోవాలని డైరెక్టర్ బోయపాటి అనుకుంటున్నారట. ఇది వరకే అల్లు అర్జున్-సమంత సన్ ఆఫ్ సత్య మూర్తి అనే సినిమా చేసిన విషయం తెలీసందే. ఇక ఆ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news