Moviesనంద‌మూరి ఫ్యాన్స్‌కు సూప‌ర్ న్యూస్‌... మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ

నంద‌మూరి ఫ్యాన్స్‌కు సూప‌ర్ న్యూస్‌… మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ

నంద‌మూరి వంశంతో మూడో త‌రం వార‌సుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ సినిమా ఎంట్రీ కోసం అభిమానులు ఎంత‌లా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్ టైంనుంచే నంద‌మూరి అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా త‌మ అభిమాన హీరో కుమారుడు ఎప్పుడు వెండితెర‌పై ఎంట్రీ ఇస్తాడా ? అని ఎదురు చూస్తున్నారు.

శాత‌కర్ణి రిలీజ్ అయ్యి కూడా నాలుగేళ్లు అవుతోంది. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు మోక్ష‌జ్ఞ ఎంట్రీపై ఎలాంటి క్లారిటీ లేదు. బాల‌య్య కూడా ప్ర‌తిసారి ఏదో ఒక మాట చెప్పి మోక్ష‌జ్ఞ సినిమా ఎంట్రీని దాట వేస్తూ వ‌స్తున్నాడు. దీనికి తోడు మోక్షజ్ఞ ఫిజిక్ కూడా స‌రిగా మెయింటైన్ చేయ‌క‌పోవ‌డంతో పాటు అత‌ని షేఫౌట్ ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో అభిమానులు కూడా తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు.

ఇటీవ‌ల మోక్ష‌జ్ఞ పుట్టిన రోజు కావ‌డంతో కొంద‌రు అభిమానులు మోక్షును క‌లిసేందుకు వెళ్లిన‌ప్పుడు మోక్షు వారితో ముచ్చ‌టించ‌డంతో పాటు త‌న సినిమా ఎంట్రీ గురించి కూడా వారితో చ‌ర్చించాడ‌ట‌.
అయితే తాజాగా అఖండ సెట్లో మోక్ష‌జ్ఞ క‌నిపించాడు. అందుకు సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటోలో బాల‌య్య‌, మోక్ష‌జ్ఞ‌తో పాటు అత‌డి తల్లి వ‌సుంధ‌రా దేవి కూడా క‌నిపించింది.

ఈ ఫొటోలో మోక్ష‌జ్ఞ చాలా క్యూట్‌గా ఉన్నాడు. ఇది చూసి నంద‌మూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మ‌నోడి సినిమా ఎంట్రీపై కూడా బాల‌య్య క‌థా చ‌ర్చ‌ల్లో ఉన్నాడ‌ట‌. మోక్షు సినిమా ఎంట్రీపై త్వ‌ర‌లోనే అదిరిపోయే న్యూస్ రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news