Moviesస‌మంత - చైతు విడాకులు... బ‌య‌ట కొస్తున్న సంచ‌ల‌న నిజాలు..!

స‌మంత – చైతు విడాకులు… బ‌య‌ట కొస్తున్న సంచ‌ల‌న నిజాలు..!

అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత విడాకుల క‌థ ముగిసింది. అయితే ఈ విడాకులు పూర్త‌య్యి నాలుగైదు రోజులు గ‌డిచాయో లేదో వ‌రుస‌గా ఒక్కో సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఈమంది రామారావు మాట్లాడుతూ స‌మంత బంగారం లాంటి సంసారాన్ని నాశ‌నం చేసుకుంద‌ని.. ఆమెకు చైతు కంటే మంచి భ‌ర్త రాడ‌ని.. స‌మంత త‌న త‌ప్పుకు భ‌విష్య‌త్తులో మూల్యం చెల్లించుకుంటుంద‌ని చెప్పారు.

నాగార్జున ఏ విష‌యంలోనూ త‌ప్పు చేసేందుకు ఒప్పుకోడ‌ని.. ఆయ‌న వెన‌క సురేష్‌బాబు, వెంక‌టేష్ ఉంటార‌ని కూడా రామారావు చెప్పారు. ఇక స‌మంత‌పై ఎవ్వ‌రో కావాల‌ని బ‌ల‌వంతంగా ఒత్తిడి చేసి మ‌రీ ఈ విడాకులు ఇప్పించార‌ని కూడా అర్థ‌మ‌వుతోంద‌న్నారు. స‌మంత ఇంకా సినిమాల్లో న‌టించ‌డంతో పాటు మ‌రికొంత కాలం హీరోయిన్‌గా ఉండాల‌ని కోరుకుంటోంద‌ని.. ఈ క్ర‌మంలోనే ఆమెకు నేరుగా పిల్ల‌ల‌ను క‌న‌డం ఇష్టం లేద‌ని.. స‌రోగ‌సీ ప‌ద్ధ‌తిలోనే పిల్ల‌ల‌ను కనాల‌నుకుంద‌ని.. ఇది అక్కినేని ఫ్యామిలీకి న‌చ్చ‌లేద‌ని అంటున్నారు.

 

ఈ విష‌యంలోనే మొద‌లైన గొడ‌వ‌లు తారాస్థాయికి చేరాయ‌ని అంటున్నారు. స‌మంత మ‌రో పెళ్లి చేసుకున్నా అక్క‌డ గొడ‌వ‌లు, మ‌న‌స్ప‌ర్థ‌లు రావా ? స‌మంత బంగారు భ‌విష్య‌త్తును నాశ‌నం చేసుకుంద‌ని రామారావు తెలిపారు. కోర్టు ఇంకా ఆరు నెల‌ల టైం ఇస్తుంద‌ని.. ఈ లోగా స‌మంత నాగార్జున ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌న్వీన్స్ చేస్తే తిరిగి ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా చైతుతో క‌లిసిపోవ‌చ్చ‌ని ఆయ‌న సూచించారు.

ఇక పెళ్ల‌య్యి నాలుగేళ్లు అవుతుంది.. ఇప్పుడు కూడా సినిమాల్లో భార్య న‌టించ‌డం చైతుకు ఇష్టం లేద‌ని.. స‌మంత మాత్రం ఈ విష‌యంలో త‌న మాటే నెగ్గాల‌న్న పంతంతో ఉండ‌డం కూడా విడాకుల‌కు మ‌రో కార‌ణ‌మైంద‌ని ఆయ‌న చెప్పారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news