Moviesజ‌గ‌న్ దెబ్బ‌కు హిట్ అయిన సినిమాల‌కు లాభాల్లేవ్‌.. ఇదే పెద్ద సాక్ష్యం..!

జ‌గ‌న్ దెబ్బ‌కు హిట్ అయిన సినిమాల‌కు లాభాల్లేవ్‌.. ఇదే పెద్ద సాక్ష్యం..!

క‌రోనాకు ముందు వ‌ర‌కు సినిమా ఇండ‌స్ట్రీ ఉరుకులు ప‌రుగులు పెట్టేసింది. మ‌న తెలుగు సినిమా రేంజ్ బాలీవుడ్‌ను దాటేసింది.. మ‌న సూప‌ర్ స్టార్లు ఒక్కో సినిమాకు రు. 50 నుంచి రు. 70 కోట్లు తీసుకుంటున్నారు అని మ‌నం ఒక్క‌టే డ‌బ్బాలు కొట్టేసి వారికి హైప్ ఇచ్చేవాళ్లం. క‌రోనా దెబ్బ‌తో ఇప్పుడు హీరోస్వామ్యం పోయి కంటెంట్ ఉన్న సినిమాకే ప‌ట్టం క‌ట్టే సీన్ క్రియేట్ అయ్యింది. స్టార్ హీరోలు అంద‌రూ ఇప్పుడు నేల‌మీద‌కు వ‌చ్చేశారు.

ఇక టాలీవుడ్‌లో ముఖ్యంగా ఏపీలో ప్ర‌భుత్వం సినిమా ఇండ‌స్ట్రీ టార్గెట్‌గా తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల‌తో సినిమా వాళ్లు ల‌బోదిబో మంటున్నారు. మొన్న‌టి వ‌ర‌కు మూడు షోల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంది. ఇక ఇప్పుడు నాలుగో షోకు అనుమ‌తి వ‌చ్చినా క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు ఉన్నాయి. టిక్కెట్ రేట్లు చాలా వ‌ర‌కు త‌గ్గించేశారు. ఈ రేట్లు ఇప్పుడు 1990 నాటి రేట్ల‌లో ఉన్నాయి. ప్ర‌స్తుతం థియేట‌ర్ల వాళ్లు పాత రేట్ల‌కే అమ్ముతున్నా ప్ర‌భుత్వం ఎప్పుడు యాక్ష‌న్‌కు దిగుతుందో అప్పుడు థియేట‌ర్లు మూత ప‌డాల్సిందే.. వాళ్ల భ‌యాలు వాళ్ల‌కు ఉన్నాయి. పెద్ద సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భుత్వం టార్గెట్ పెట్టిందంటే వీళ్లంతా మ‌టాషే.

అంతెందుకు ఇప్పుడు ఏపీలో హిట్ అయిన సినిమాల‌కు కూడా లాభాల్లేవు. తెలంగాణలో మంచి లాభాలు తెచ్చిన చైతు లవ్ స్టోరీ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలకు ఏపీలో న‌ష్టం వ‌చ్చిందంటే ఎవ‌రైనా న‌మ్ముతారా.. కానీ న‌మ్మాల్సిందే. చివ‌ర‌కు ఏపీలో ఇప్పుడు అన్ని సినిమాల బిజినెస్ డీల్స్‌ను రివైజ్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ రైట్స్ పాత రేట్ల కంటే 30 % త‌గ్గించి అమ్ముతున్నారు.

టిక్కెట్లు పెంచుకునే జీవో వ‌స్తుంద‌ని కొద్ది రోజులుగా ప్ర‌చారం ఉన్నా జ‌గ‌న్‌ను ధైర్యం చేసి అడిగే వారే లేరు. ఏదేమైనా ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీ నెత్తిన పిడుగు మాదిరిగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news