Moviesకార్తీక‌దీపంలో పెద్ద ట్విస్ట్‌.. మోనిత‌కు కొడుకు.. దీప క‌న్నుమూత‌..?

కార్తీక‌దీపంలో పెద్ద ట్విస్ట్‌.. మోనిత‌కు కొడుకు.. దీప క‌న్నుమూత‌..?

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను టీవీల‌కు క‌ట్టిప‌డేస్తోన్న టాప్ సీరియ‌ల్ కార్తీక‌దీపం. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జల ఆద‌రాభిమానాల‌తో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా కార్తీక‌దీపం టీఆర్పీల‌ను ఏదీ కూడా ట‌చ్ చేయ‌డం లేదు. రోజు రోజుకు ఎంతో ఉత్కంఠ‌తో ఉంటోన్న ఈ సీరియ‌ల్లో ఇప్పుడు అతిపెద్ద ట్విస్ట్ చోటు చేసుకోబోతోంద‌ట‌. కృత్రిమంగా ప్రెగ్నెంట్ అయిన మోనిత జైలు నుంచి రిలీజ్ అవ్వ‌డంతో కార్తీక్ త‌న అమెరికా ప్ర‌యాణం వాయిదా వేసుకుంటాడ‌ట‌.

సోమ‌వారం ఎపిసోడ్‌లో గ‌ర్భిణిగా ఉన్న మోనిత‌కు పురిటి నొప్పులు వ‌స్తాయ‌ట‌. ఆమె ప‌రిస్థితి క్రిటిక‌ల్‌గా ఉండ‌డంతో ఆమె మాత్రం కార్తీక్ వ‌స్తే గాని ఆప‌రేష‌న్ చేయించుకోన‌ని చెపుతుంద‌ట‌. అదే టైంలో భార‌తి కార్తీక్‌కు ఫోన్ చేస్తే సీరియ‌స్ అవుతాడ‌ట‌. ఆ త‌ర్వాత మోనిత‌కు ఆమె ముందు చెప్పిన‌ట్టుగానే బాబు పుడ‌తాడ‌ట‌.

 

ఈ ట్విస్ట్ ఇలా ఉంటే మోనిత‌కు కొడుకు పుట్ట‌డంతో దీప కుటుంబం పెద్ద షాక్‌లోకి వెళుతుంద‌ట‌. ఏదేమైనా దీప కుటుంబాన్ని మ‌రిన్ని క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని.. ఆమె చ‌నిపోతుంద‌న్న క‌థ‌నాలు కూడా విన‌ప‌డుతున్నాయి. దీప చ‌నిపోవ‌డంతో కార్తీక్ అస‌లు నిజం తెలుసుకుని బాధ‌ప‌డ‌తాడా ? లేదా పిల్ల‌లు పెద్ద వాళ్లు అయిన‌ట్టుగా క‌థ‌ను న‌డిపిస్తారా ? అన్న‌దే ఇప్పుడు స‌స్పెన్స్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news