Moviesనువ్వు నన్ను హర్ట్ చేసావ్..సమంత షాకింగ్ కామెంట్స్..!!

నువ్వు నన్ను హర్ట్ చేసావ్..సమంత షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్‌లో గ‌త కొంత కాలంగా హాట్ డిస్క‌ర్ష‌న్ ఏదైనా ఉందా ? అంటే అది చైతు – స‌మంత విడాకుల వ్య‌వ‌హార‌మే. వార్త‌లు ఎలా ఉన్నా స‌మంత పెడుతోన్న పోస్టులు అయితే వీరి మ‌ధ్య గ్యాప్‌ను బ‌ల‌ప‌రిచేలా ఉన్నాయి. స‌మంత త‌న సోష‌ల్ మీడియాలో అక్కినేని అన్న ప‌దం తొల‌గించిన‌ప్ప‌టి నుంచి ఆమె వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు కూడా ఆమె చైతుకు దూరం అవుతోంద‌న్న ప్ర‌చారాన్ని మ‌రింత బ‌ల‌ప‌రుస్తోంది.

ఇప్ప‌టికే ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడాకుల‌కు అప్లై చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇద్ద‌రూ వేర్వేరుగా ఉంటున్న‌ట్టు భోగ‌ట్టా ? స‌మంత చెన్నైలో ఉంటోంద‌ట‌. ఇక చైతు హైద‌రాబాద్లో ఒంట‌రిగానే ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇక మొన్నటికిమొన్న తిరుమలలో మీడియా మీద సమంత చేసిన వ్యాఖ్యలు కూడా కొత్త అనుమానాలకు దారి తీస్తున్నాయి. విడాకుల రూమర్లపై స్పందించమని అడగడం, బుద్ది ఉందా? అంటూ మీడియాపైనే సమంత ఘాటుగా స్పందించడంతో అసలు కథ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అలా మొత్తానికి చైతన్య, సమంతల వ్యవహారం సోషల్ మీడియా పెద్ద చర్చకే దారి తీస్తోంది.

అయితే సమంత తాజాగా చేసిన ఓ పోస్ట్ వీరు ఇద్దరు విడాకులు తీసుకుటున్నారని అందరిని కంఫం చేస్తుంది. ఇంతకి సమంత ఆ పోస్ట్ లో ఏం పెట్టిందీ తెలుసా..?? నువ్వు నన్ను బాధపెట్టి వుండొచ్చు..నేను నిన్ను బాధ పెట్టి వుండొచ్చు. ఒకరిని ఒకరం బాధ పెట్టుకుని వుండొచ్చు. మొత్తానికి రియాల్టీ ఇదే.. వసంత కాలాన్ని పొందాలంటే శిశిరాన్ని కూడా భరించాలి అంటూ ఇలా తన ప్రస్తుత పరిస్థితిని చెబుతోన్నట్టు కనిపిస్తోంది. ఏది ఏమీనా సమంత నాగ చైతన్య విడాకులు హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news