Moviesఅన్నా, చెల్లెళ్లుగా న‌టించిన టాలీవుడ్ హీరో, హీరోయిన్లు వీళ్లే ...!

అన్నా, చెల్లెళ్లుగా న‌టించిన టాలీవుడ్ హీరో, హీరోయిన్లు వీళ్లే …!

టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు, హీరోయిన్లు జంట‌లుగా న‌టించ‌డంతో పాటు అక్కా, త‌మ్ముడిగా, అన్నా చెల్లెళ్లుగా న‌టించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు కూతురుగా న‌టించిన అందాల సుంద‌రి శ్రీదేవి త‌ర్వాత అదే ఎన్టీఆర్ ప‌క్క‌న హీరోయిన్‌గా చేసింది. అదే శ్రీదేవి తండ్రి, కొడుకులు అయిన ఏఎన్నార్‌, నాగార్జున ఇద్ద‌రి ప‌క్క‌న కూడా హీరోయిన్‌గా న‌టించింది. అలాగే కొంద‌రు స్టార్ హీరో, హీరోయిన్లు కొన్ని సినిమాల్లో అన్నా చెల్లెళ్లుగా న‌టించి మెప్పించారు.

1-మ‌హేష్‌బాబు – కీర్తిరెడ్డి : వీరిద్ద‌రు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అర్జున్ సినిమాలో అన్నా చెల్లిగా న‌టించారు. ఈ సినిమా అంతా అన్నా చెల్లి సెంటిమెంట్ చుట్టూనే తిరుగుతుంది.

2- రాజ‌శేఖ‌ర్ – మీరా జాస్మిన్‌: చెల్లి సెంటిమెంట్ నేప‌థ్యంలో వ‌చ్చిన గోరింటాకు సినిమాలో వీరిద్ద‌రు అన్నా చెల్లిగా న‌టించారు. ఇక రాజ‌శేఖ‌ర్ భార్య‌గా ఆర్తీ అగ‌ర్వాల్ న‌టించారు.

3- రామ్‌చ‌ర‌ణ్ – కృతి క‌ర్బంద‌: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌న తీన్‌మార్‌లో హీరోయిన్‌గా చేసిన కృతి క‌ర్బందా బ్రూస్ లీ సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌కు అక్కగా న‌టించింది.

4 – సుధీర్‌బాబు – స‌మంత‌: స‌మంత తొలి సినిమా ఏమాయ చేశావే లో సుధీర్‌బాబు స‌మంత‌కు అన్న‌గా న‌టించాడు. ఈ సినిమాలో స‌మంత‌కు జోడీగా చైతు న‌టించాడు.

5- బాల‌కృష్ణ – దేవ‌యాని: యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ చెన్న‌కేశ‌వ రెడ్డి సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సుస్వాగ‌తం హీరోయిన్ దేవ‌యాని చెల్లిగా న‌టించింది.

6- శ్రీహ‌రి – త్రిష‌: రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి – త్రిష నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో అన్నా చెల్లెళ్లుగా న‌టించారు.

7- విష్ణు – కాజ‌ల్ అగ‌ర్వాల్‌: జంట‌గా న‌టించాల్సిన మంచు విష్ణు, కాజ‌ల్ అగ‌ర్వాల్ మోస‌గాళ్లు సినిమాలో అన్నా చెల్లిగా న‌టించారు. ఇది నిజంగా ఓ సంచ‌ల‌న‌మే అని చెప్పాలి.

8- ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సంధ్య‌: భీమినేని శ్రీనివాస‌రావువ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అన్న‌వ‌రం సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సంధ్య అన్నా చెల్లెళ్లుగా క‌నిపిస్తారు.

ఇక వీరితో పాటు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలో ఉపేంద్ర – నిత్యామీన‌న్ , స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి – ఖుష్బూ, బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలో అల్ల‌రి న‌రేష్ – కార్తీక నాయ‌ర్‌, ఇష్క్ సినిమాలో నితిన్ – సింధు తులానీ, మ‌సాలా సినిమాలో రామ్ – అంజ‌లి అక్కా, చెల్లెలు లేదా అన్నా, చెల్లెలు పాత్ర‌లో న‌టించారు. ఇక త్వ‌ర‌లో మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న భోళా శంక‌ర్ సినిమాలో ఆయ‌న‌కు చెల్లిగా యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news