Moviesనెట్టింట మార్మోగిపోతున్న మహేష్ బాబు పేరు..అభిమానులు సంబరాలు.. ఎందుకో తెలుసా..??

నెట్టింట మార్మోగిపోతున్న మహేష్ బాబు పేరు..అభిమానులు సంబరాలు.. ఎందుకో తెలుసా..??

తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇక ఆయన ఫ్యాన్స్ ను.. అభిమానులు అని కాదు ఏకంగా భక్తులు అంటుంటారు అందరు. మహేష్ అభిమానులు ఆయన లాగే చాలా సైలెంట్ గా ఉంటారు. మహేష్ బాబు అభిమానులు సాఫ్ట్ అనే బిరుదు కూడా ఉంది. మహేష్ బాబు అంటేనే సాఫ్ట్ మ్యాన్. ఇంకా పక్కాగా చెప్పలంటే జెంటిల్ మ్యాన్.

మాస్ సినిమాలు చేసినా క్లాస్ హీరోగా మహేష్ కు తిరుగులేని ఇమేజ్ ఉంటుంది.. అందుకే ఏమో ఇతర హీరోల అభిమానులలు కూడా మహేష్ బాబు కి సపోర్ట్ చేస్తారు. తమకు నచ్చే హీరో కోసం అభిమానులు ఏమైనా చేస్తారు. తమ అభిమాని హీరోల పుట్టినరోజు అయినా..?? వాళ్ల సినిమా గురించి ఏదైనా అప్డేట్ వచ్చినా..?? సోషల్ మీడియాలో వాళ్ల ఫాలోవర్స్ పెరిగినా..?? అభిమానులకి అది పెద్ద పడగే..ఇక ఆ వార్త ని చెపుతూ..సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడు మహేష్ అభిమానులు కూడా అదే చేస్తున్నారు.

వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేశ్‌బాబు తాజాగా సోషల్‌ మీడియాలోనూ మంచి జోరు మీద ఉన్నాడు. మహేష్ బాబు ఫేస్‌బుక్‌లో ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 15 మిలియన్లు దాటింది. దీంతో ఆయన అభిమానులు నెట్టింట సంబరాలు జరుపుకుంటున్నారు. మహేశ్‌బాబుకు సంబంధించిన హ్యాష్ ట్యాగులతో.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పేరు నెట్టింట మార్మోగిపోతోంది. కాగా మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సర్కారువారి పాట’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయడానికి మేకర్స్ డిసైడ్ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news