Moviesనాగ చైతన్య లవ్‌స్టోరీ పై సమంత రియాక్షన్..ఏమన్నారో తెలుసా..?

నాగ చైతన్య లవ్‌స్టోరీ పై సమంత రియాక్షన్..ఏమన్నారో తెలుసా..?

ఫీల్‌గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చి అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బొంబాట్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల తన నెక్ట్స్ సినిమాను.. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమాలోని ‘సారంగ దరియా’ పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా సెప్టెంబర్‌ 24న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. . హీరో నాగ చైతన్య డ్యాన్స్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లో చై డ్యాన్స్‌ మాస్టర్‌గా కనిపించాడు. సాయిపల్లవి ఎంట్రీ, ఆ తర్వాత తెలంగాణ యాసలో ఇక బాసండ్లు తోముడే అంటూ తన ఫ్రెండ్‌తో చెప్పే డైలాగ్‌ తెగ ఆకట్టుకుంటోంది.

ఎమోషనల్‌, లవ్‌ ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో ఉన్న ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌తో సరికొత్త రికార్డ్‌ సెట్‌ చేసే దిశగా వెళుతోంది.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సినిమా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ ట్రైలర్‌పై నటి, నాగచైతన్య సతీమణి సమంత ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఈ సినిమా కచ్చితంగా విజయంతమవుతుంది. చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ క్యా్ప్షన్‌ జోడించి పోస్ట్ చేసారు.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news