Movies'సలార్' సినిమా : ఆ సాంగ్ లో హై వోల్టేజ్ ప్రభాస్...

‘సలార్’ సినిమా : ఆ సాంగ్ లో హై వోల్టేజ్ ప్రభాస్ ని చూస్తారు..?

డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాబోతున్న మరో భారీ సినిమా ‘సలార్’. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన శ్రుతి హసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని టాక్. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇందులో ప్రభాస్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా కొసం ప్రభాస్ ఓ రేంజ్‌లో కష్టపడుతున్నారట. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసిన డైరెక్టర్.. మూడో షెడ్యూల్ మరింత భారీగా ప్లాన్ చేశారని సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా కొసం ప్రభాస్ ఓ రేంజ్‌లో కష్టపడుతున్నారట. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసిన డైరెక్టర్.. మూడో షెడ్యూల్ మరింత భారీగా ప్లాన్ చేశారని సమాచారం. హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతున్న యాక్షన్ ఎపిసోడ్స్ ఎంతో కీలకం కాబోతున్న ఈ ‘సలార్’ సినిమాకు, కేటాయించిన బడ్జెట్‌లో ఎక్కువమొత్తం వీటికే కేటాయిస్తున్నారట. ఇక ఇంటర్ వెల్ ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాలు టోటల్ సినిమా కే హైలెట్ గా ఉండబోతున్నాట్లు తెలుస్తుంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా షూట్ చేయాలని ప్రశాంత్ నీల్ స్కెచ్చేశారట.

ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. అంతేకాదు “సలార్”లో ఒక ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. కాగా ఆ సాంగ్ కోసం కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో షూట్ చేస్తారట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీలో హీరోయిన్‏గా చేసినా శ్రీనిధి శెట్టికి మంచి క్రేజ్ ఉంది. తానూ రాసుకున్న కథలో వచ్చే స్పెషల్ సాంగ్‏లో శ్రీనిధి పర్ఫెక్ట్‏గా సరిపోతుందని ప్రశాంత్ ఆమెను తీసుకున్నాడట.. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news